వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనగర్ లాల్‌చౌక్‌లో మీరు జాతీయ జెండా ఎగరేయగలరా?: మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వృద్ధ నేత ఫరూఖ్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నేరుగా సవాల్ చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వృద్ధ నేత ఫరూఖ్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నేరుగా సవాల్ చేశారు.

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరులో జాతీయ జెండాను ఎగురవేయడం గురించి పక్కనబెట్టండి, కనీసం శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగరేయగలరా? అని నిలదీశారు.

farooq-abdullah

''వాళ్ళు (బీజేపీ, కేంద్ర ప్రభుత్వం) పాక్ ఆక్రమిత కశ్మీరులో జెండా ఎగరేయడం గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను వాళ్లని శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌కు వెళ్ళి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయమని అడుగుతున్నాను. వాళ్ళు ఆ పనిని ఇక్కడే చేయలేరు, పాక్ ఆక్రమిత కశ్మీరు గురించి మాట్లాడుతున్నారు..'' అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత జీఎల్ డోగ్రా 30వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన తర్వాత ఫరూఖ్ అబ్దుల్లా విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు పాకిప్తాన్‌దే అని కూడా ఆయన అన్నారు.

English summary
Days after sparking a controversy with his statement that the Pakistan-occupied-Kashmir belonged to the neighbouring country, former Jammu and Kashmir chief minister Farooq Abdullah on Monday triggered a fresh row by commenting on hoisting of tricolour at Lal Chowk in Srinagar. The National Conference veteran leader has now dared the Narendra Modi government at the Centre to hoist the national flag at Lal Chowk before talking about hoisting one in Pakistan-occupied-Kashmir. “They (Centre and BJP) are talking about raising flag in PoK. I ask them first you go and raise the tricolour at Lal Chowk in Srinagar. They can’t even do that here and they are talking about PoK," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X