వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: సీఎం పబ్లిక్ మీటింగ్ కు వంద మంది: పన్నీర్ సెల్వం మీటింగ్ కు లక్ష మంది !

శుక్రవారం రాత్రి మదురైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. కాంచీపురంలో పన్నీర్ సెల్వం ఏర్పాటు చేసిన బహిరంగ

|
Google Oneindia TeluguNews

మదురై/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఊహించని షాక్ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అనుకున్న రీతిలో ప్రజలు, కార్యకర్తలు తరలిరాకపోవడంతో ఆయన నాయకులపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారని వెలుగు చూసింది. అదే రోజు పన్నీర్ సెల్వం కాంచీపురం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఊహించని రీతిలో ప్రజలు తరలివచ్చారు.

రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాను: ఒక్క రూపాయి రాలేదు: పన్నీర్ అసహనం, ఎందుకంటే!రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాను: ఒక్క రూపాయి రాలేదు: పన్నీర్ అసహనం, ఎందుకంటే!

కార్యకర్తలు, ప్రజలను తరలించలేని మంత్రులు, నాయకులు బహిరంగ సభను ఎందుకు ఏర్పాటు చేశారని నిలదీశారని సమాచారం. ఇలాంటి చేతకానివారిని నమ్ముకుని బహిరంగ సభకు హాజరుకావడం నాదే తప్పు అంటు మండిపడ్డారని అన్నాడీఎంకే (అమ్మ) వర్గాలు అంటున్నాయి. అయితే పన్నీర్ సెల్వం మీటింగ్ అనుకోని రీతిలో కార్యకర్తలు తరలిరావడంతో అధికార పార్టీ నాయకులు పెద్ద షాక్ ఇచ్చారు.

 పన్నీర్, పళనిసామి పోటా పోటీగా

పన్నీర్, పళనిసామి పోటా పోటీగా

ఒకే రోజు, ఒకే సమయానికి పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు బహిరంగ సభలు ఏర్పాటు చేశాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఊహించని రీతిలో ప్రజలు తరలిరావడంతో అధికార వర్గం నాయకులు షాక్ కు గురైనారు. శుక్రవారం రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభలు గమనిస్తే ప్రజలు పన్నీర్ సెల్వం వైపు ఉన్నారని తెలుస్తోందిని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మదురైలో

మదురైలో

మదురైలోని వైగై నది మీదుగా రెండు ఫ్లైఓబర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం 2014లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూ. 30.47 కోట్లు కేటాయించారు. అరబ్ పాలయం, అరుళ్ దాస్ పురం, సెల్లూర్, తిరుములై రాయర్ పట్టిదురై ప్రాంతాలు కలిపే విధంగా నదిపై వంతెన నిర్మాణం పూర్తి అయ్యింది.

పళనిసామికి ఘనస్వాగం

పళనిసామికి ఘనస్వాగం

శుక్రవారం మద్యాహ్నం విమానంలో మదురై చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి విమాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. నగరంలో రోడ్డుకు ఇరువైపుల మహిళలు, కార్యకర్తలు స్వాగతం పలకడంతో పళనిసామి సంతోషం వ్యక్తం చేశారు. తరువాత కొత్తగా నిర్మించిన వంతెనలను ప్రారంభించడానికి వెళ్లారు.

ఎంజీఆర్, జయలలిత పేర్లు

ఎంజీఆర్, జయలలిత పేర్లు

కొత్తగా నిర్మించిన వంతెనలను సీఎం పళనిసామి ప్రారంభించారు. అరబ్ పాళయం-అరుళ్ దాస్ పురం వంతెనకు అమ్మ జయలలిత పేరు పెట్టారు. సెల్లూర్-తిరుమలైరాయర్ పట్టిదురై వంతెనకు ఎంజీఆర్ పేరు పెట్టారు. మదురైలో చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ రెండు వంతెనలను ప్రభుత్వం ప్రారంభించింది.

రూ.22.25 కోట్ల అభివృద్ది పథకాలు

రూ.22.25 కోట్ల అభివృద్ది పథకాలు

శుక్రవారం రాత్రి మదురై నగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు హాజరైన సీఎం ఎడప్పాడి పళనిసామి రూ.22.25 కోట్ల అభివృద్ది పథకాలు, సంక్షేమ పథకాలు అందజేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రజలు కార్యకర్తలు రాకపోవడంతో కుర్చీలు అన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చాయి.

విరుచుకుపడిన సీఎం

విరుచుకుపడిన సీఎం

బహిరంగ సభలో కుర్చీలు అన్నీ ఖాళీగా ఉన్న విషయం గుర్తించిన సీఎం పళనిసామి కార్యకర్తలను తరలించకుండా మీరు ఎందుకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు అంటూ మంత్రులు, నాయకుల మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారని తెలిసింది.

పన్నీర్ సెల్వం

పన్నీర్ సెల్వం

స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి కాంచీపురం నుంచి రాష్ట్ర పర్యటన ప్రారంభించారు.

పన్నీర్ సెల్వం సభ సక్సస్

పన్నీర్ సెల్వం సభ సక్సస్

కాంచీపురంలో శుక్రవారం రాత్రి పన్నీర్ సెల్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభ సక్సస్ అయ్యింది. ఊహించనిరీతిలో ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తలు తరలిరావడంతో పన్నీర్ సెల్వం వర్గంలో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రజలు పన్నీరు సెల్వం వైపు ఉన్నారని వెలుగు చూసింది.

 ప్రజలే బుద్ది చెబుతారు

ప్రజలే బుద్ది చెబుతారు

జయలలితను మోసం చేసిన శశికళ వర్గంలోని ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని పన్నీర్ సెల్వం ఈ సందర్బలో అన్నారు. పన్నీర్ సెల్వం మాట్లాడుతున్న సమయంలో ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో మరింత ఉత్సాహంగా పన్నీర్ సెల్వం ముందుకు వెలుతున్నారు.

English summary
Edappadi Palanisamy's competete meeting held at madurai doesnot get much attention from people and party cadres. Former chief minister o.pannerselvam meeting in Kancheepuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X