మాజీ సీజేఐ, ఎంపీ రంజన్ గొగొయ్‌కు జడ్ ప్లస్ వీఐపీ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ వీఐపీ భద్రతను కల్పించింది. ఈ క్రయంలో ఆయనకు సీఆర్పీఎఫ్ సాయుద కమాండోలు భద్రతగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా రంజన్ గొగయ్కు ఈ భద్రత ఉండనుంది. గతంలో ఢిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. కాగా, 2019 నవంబర్ నెలలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.

ఆ తర్వాత రంజన్ గొగొయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఆర్పీఎఫ్కు చెందిన వీఐపీ భద్రతా విభాగం నుంచి ఆయనకు కమాండోలతో భద్రత కలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 8 నుంచి 12 మంది సీఆర్పీఎఫ్ కమాండోలతో కూడిన మొబైల్ టీం ఆయనకు నిరంతరం భద్రతగా ఉండనుంది. కాగా, ఈ భద్రత పొందుతున్న 63వ వ్యక్తిగా గొగొయ్ ఉన్నారని తెలిపాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications