మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు భారీ షాక్ ఇచ్చిన సోదరుడు, నేను జీవితాంతం !
బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంపింగ్ లు జోరుగా సాగుతున్నాయి. తాను పార్టీ మారుతానని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత జగదీష్ శెట్టర్ కొన్ని రోజుల క్రితం బీజేపీ హైకమాండ్ ను హెచ్చరించినా ఆ పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదు.
దెబ్బకు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీఫామ్ కూడా చేతిలో పట్టుకుని హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి హుబ్ళళి వెళ్లిపోయారు. హుబ్ళళి-ధారవాడలోని బీజేపీ నాయకులు చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం అయ్యారు.

అయితే .జగదీష్ శెట్టర్ కు సొంత ఇంటిలోని ఎదురుదెబ్బ తగిలింది. జగదీష్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారని, ఆయనకు బీఫామ్ కూడా వచ్చిందని, అయితే తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని మాజీ సీఎం శెట్టర్ సోదరుడు, బీజేపీ ఎమ్మెల్సీ ప్రదీప్ శెట్టర్ సోమవారం హుబ్ళళిలో మీడియాకు చెప్పారు.

నేను మా అన్న జగదీష్ శెట్టర్ ఇంటికి ప్రతిరోజు వెలుతాను, అక్కడే భోజనం చేస్తాను, ఆయనతో కలిసి మాట్లాడుతాను, అయితే వ్యక్తిగత విషయాలు వేరు, రాజకీయాలు వేరు, నేను మాత్రం కాంగ్రెస్ లో చేరని, బీజేపీలోనే ఉంటానని బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం సోదరుడు జగదీష్ శెట్టర్ సోదరుడు ప్రదీప్ శెట్టర్ స్పష్టం చేశారు.

అన్నదమ్ములు జగదీష్ శెట్టర్, ప్రదీప్ శెట్టర్ రెండు వేర్వేరు పార్టీల్లో ఉన్నా కలిసే ఉంటామని చెప్పడంతో ఆయన అనుచరులు, అభిమానుల్లో అయోమయం నెలకొంది. అయితే కాంగ్రెస్ లో చేరిన తరువాత హుబ్బళికి వెళ్లిన జగదీష్ శెట్టర్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications