మోదీ, అమిత్ షాకు షాక్ ఇచ్చిన మాజీ సీఎం, ఎన్నికల్లో పోటీ చేస్తాని తేల్చేసిన ఫైర్ బ్రాండ్ !

బోపాల్: బీజేపీ నాయకత్వం అండగా నిలబడకపోవడంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి సొంత పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. నేను రాజకీయాలను వీడలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు.

మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని సాగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాజీ సీఎం ఉమాభారతి మాట్లాడుతూ, నేను చాలా కాలంగా రాజకీయాల్లో బీజేపీలో పనిచేస్తున్నాను. అయితే మధ్యలో ఐదేళ్లు విరామం తీసుకున్నాను. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని మాజీ సీఎం ఉమాభారతి అన్నారు. '

Former CM Uma Bharti shocked the BJP by saying that she will contest the assembly elections

నేను చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నందున గతసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించిందని,. అందుకే ఐదేళ్లు విరామం తీసుకోవాలని అనుకున్నానని ఉమాభారతి అన్నారు. నేను రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రజలు అనుకున్నారు, కానీ నేను రాజకీయాలను వదిలిపెట్టలేదని మాజీ సీఎం ఉమాభారతి అన్నారు.

కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు, లలిత్‌పూర్-సింగ్‌రౌలీ రైలు మార్గంతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన ఉమాభారతి తాను రాజకీయాల్లో ఉన్నందున ఈ ప్రాజెక్టులు సాకారమయ్యాయని, తానే ఆ ప్రాజెక్టులన ప్రజలకు అంకితం చేశానని, తన పట్టుదల వలనే ఆ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని ఆమె అన్నారు.

నాకు 75 ఏళ్లు అయ్యాయని, 85 ఏళ్లయినా తాను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని, రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం అని మాజీ సీఎం ఉమాభారతి అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Former CM Uma Bharti shocked the BJP by saying that she will contest the assembly elections

ఇప్పుడు ఉమాభారతి ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉమాభారతి చివరిసారిగా 2014లో ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. గెలిచిన తర్వాత ఉమాభారతి కేంద్రం మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా ఉమాభారతి ఐదు సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ నెల ప్రారంభంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించిన జన ఆశీర్వాద యాత్రకు ఉమాభారతిని ఆహ్వానించలేదు. ఈ నేప‌థ్యంలో ఉమాభారతి బీజేపీ అధిష్టానంతో విబేధించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఉమాభారతి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతారా ? అనేప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

మధ్యప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల సర్వేల ప్రకారం బీజేపీకి వ్యతిరేకత కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ ఉమాభారతి బీజేపీపై తిరుగుబాటు చేస్తే పరిస్థితి మరింత దిగజారడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఉమాభారతి ఎటు పయనిస్తారు అని కొంతకాలం వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+