మోదీ అసలు దీక్షలు చేసి అయోధ్యలో పూజలు చేశారా ?, అలా చేస్తే మనిషి బతుకుతాడా ?, మాజీ సీఎం !

ప్రధాని నరేంద్ర మోదీ ఉపవాసదీక్షచేయలేదని, కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగి ఉపవాసం ఉంటే ఒక వ్యక్తి ఒకటి లేదా రెండు రోజుల్లో కిందకు పడిపోతాడని, అలాంటిది 11 రోజులు ఉపవాసం ఉంటే మనిషి బ్రతకలేడని, దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నిరాహార దీక్షపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ అనుమానం వ్యక్తం చేశారు.

కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం వీరప్ప మొయిలి ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో మారణహోమం జరిగిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ రాజధర్మం పాటించలేదని వీరప్ప మొయిలి ఆరోపించారు. అలాంటి మోదీ అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ ? అని మాజీ సీఎం వీరప్ప మొయిలీ ప్రధాని మోదీతో పాటు బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

Former CM Virappa Moili accused Narendra Modi of performing puja in Ayodhya for 11 days without initiation.

ఇలాంటి నరేంద్ర మోదీ వల్ల అయోధ్యలోని శ్రీరాముడి ఆలయానికి పవిత్రత వస్తుందా ? అని మాజీ సీఎం వీరప్ప మొయిలి ప్రశ్నించారు. మోదీ ఎలాంటి ఉపవాస దీక్ష చెయ్యలేదని వీరప్ప మొయిలి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఉపవాసదీక్ష చేశారనే అనుమానం చాలా మందకి ఉందని, ఆయన ఉపవాసం చెయ్యకుండా గర్భగుడిలోకి వెళితే అపవిత్రం అవుతుందని, ఇలా గర్భగుడిలోకి వెళ్లి పూజలు చేస్తే ఆ ప్రదేశం అపవిత్రమవుతుందని మాజీ సీఎం వీరప్ప మొయిలి అన్నారు.

ఉపవాసం చెయ్యకుండా గర్బగుడిలో ప్రత్యేక పూజలు చేస్తే అపవిత్రమైనందున ఆ స్థలంలో ఎలాంటి శక్తి ఉండదని, రామమందిరం పేరుతో ఇంతకాలం రాజకీయాలు చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇక నుంచి బీజేపీ మాట్లాడటానికి ఏమీ ఉండదని, బీజేపీకి రామ మందిరం తప్పా మాట్లాడేందుకు మరో అంశం లేదని మాజీ సీఎం వీరప్ప మొయిలి ఆరోపించారు. నరేంద్ర మోదీ గర్భగుడిలోకి ప్రవేశించడం చాలా తప్పు అని, రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చెయ్యడం కూడా తప్పే అని వీరప్ప మొయిలి ఆరోపించారు.

Former CM Virappa Moili accused Narendra Modi of performing puja in Ayodhya for 11 days without initiation.
అందమైన లేడీ టీచర్ రీల్స్ అదుర్స్, ఇంట్లో మొగుడు, వయసులో చిన్నోడు ఏం చేశాడంటే ?, అక్కడే !

నిజమైన స్వామీజీలు, బ్రాహ్మణులు అయితే మోదీని శ్రీరాముడి గర్బగుడిలోకి ఎలా అనుమతించారని మాజీ సీఎం వీరప్ప మొయిలి ప్రశ్నించారు. అయోధ్యే రామమందిరంలో రామ్‌ లల్లాను ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని గర్భగుడిలోకి రానివ్వకుండా ఉండాల్సిందని, రామమందిరం అసంపూర్తిగా ఉందని ప్రధాని మోదీపై మాజీ సీఎం వీరప్ప మొయిలి మండిపడ్డారు.

ఒక్క రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేస్తేసరిపోదని, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయడు విగ్రహాలు అయోధ్యలో ఉండాలని, అప్పుడే రామమందిరం పూర్తి అవుతుందని వీరప్ప మొయిలి అన్నారు. అయోధ్యలో అద్భుతమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించారు. అమృత రామ్ లల్లా గౌరవాన్ని ప్రధాని మోదీ నెరవేర్చారు. రామమందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన తన 11 రోజుల ఉపవాస దీక్షను ముగించారు. అసలు నరేంద్ర మోదీ 11 రోజుల ఉపవాస దీక్ష చెయ్యలేదని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+