అందమైన లేడీ టీచర్ రీల్స్ అదుర్స్, ఇంట్లో మొగుడు, వయసులో చిన్నోడు ఏం చేశాడంటే ?, అక్కడే !
లేడీ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న యువతి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నది. టీచర్ ఉద్యోగం చేస్తున్న యువతి చాలా అందంగా ఉండటంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెడుతున్నది. టీచర్ ఉద్యోగం చేస్తున్న యువతి సినిమా హీరోయిన్ లాగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి గతంలో చాలా మంది పోటీ పడ్డారు. అయితే వివాహం చేసుకుని భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న లేడీ టీచర్ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.
స్కూల్ కు వెళ్లిన తరువాత అదృశ్యమైన మహిళ శవమై కనిపించిన ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకా మేలుకోటే పుణ్యక్షేత్రంలో కలకలం రేపింది. రెండు రోజుల నుంచి కనపడకుండా పోయిన లేడీ టీచర్ సోమవారం సాయంత్రం కొండ మీద శవమై కనిపించింది. దీపికా అలియాస్ దీపా మేడమ్ (28) అనే మహిళ హత్యకు గురైందని పోలీసు అధికారులు తెలిపారు.

దీపికాను హత్య చేసిన హంతకులు ఆమెను కొండ మీద గుంత తీసి అందులో ఆమె శవాన్ని మట్టిలో పాతిపెట్టడం కలకలం రేపింది. హత్యకు గురైన దీపికా మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని మాణిక్యహళ్లి గ్రామానికి చెందినది. దీపికా మేలుకోటేలోని ఎస్ ఇటీ (సెట్) స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నది. కొన్ని సంవత్సరాల క్రితం దీపికాకు ఓ యువకుడితో వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న దీపికా ఆమె భర్తతో కాలిసి కాపురం చేస్తున్నది.
వివాహం చేసుకున్న తరువాత దీపికా ప్రతిరోజు స్కూటర్ లో స్కూల్ కు వెళ్లి వస్తోంది. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన తర్వాత దీపిక కనిపించకుండా పోయింది. ఇదే నెల జనవరి 20వ తేదీ మధ్యాహ్నం నుంచి దీపికా కనిపించకుండా పోయింది. దీపికా అదృశ్యంపై ఆమె భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు జనవరి 20వ తేదీ సాయంత్రం మేలుకోటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి లేడీ టీచర్ దీపికా కోసం గాలించారు.
సోమవారం సాయంత్రం (జనవరి 22వ తేదీ) సాయంత్రం మేలుకోటేలోని కొండ మీద అటువైపు వెలుతున్న వారికి ఆ ప్రాంతంలో ఎక్కువగా దుర్వాసన రావడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మేలుకోటే కొండ మీద ఉన్న సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కొండ మీద గుంతలో మట్టిని తీసి మళ్లి పాతిపెట్టిన విషయం గమనించిన పోలీసులకు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది.
తహసిల్దార్ సమక్షంలో పోలీసులు ఆ గుంతను తీసి చూడగా అందులో దీపికా మృతదేహం లభ్యమైంది. దీపికా మృతదేహం పీలేకోటే గుట్ట దిగువన లభ్యం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. దీపికా మిస్సింగ్ కేసు నమోదు అయిన తరువాత ఆమె హత్యకు గురికావడంతో ఈ కేసులో పలు అనుమానాలకు తావిస్తోంది. మండ్య ఎస్పీ యతీష్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. హత్యకు గురైన లేడీ టీచర్ దీపికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉందని పోలీసులు అన్నారు.
శుభకార్యాలు, పండుగలు, ఫంక్షల సమయంలో దీపికా ఆమె భర్తతో పాటు బందువులు, స్కూల్ పిల్లలతో కలిసి రీల్స్ తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసేదని, దీపికా అందాన్ని చాలా మంది మెచ్చుకుని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెట్టేవాళ్లని పోలీసు అధికారులు అంటున్నారు. స్కూల్ కు వెళ్లి టీచర్ దీపికా హత్యకు గురి కావడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

దీపికా మొబైల్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. జనవరి 20వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత దీపికా నితీష్ (22) అనే యువకుడితో ఫోన్ లో మాట్లాడిందని పోలీసులు గుర్తించారు. నితీష్ కంటే వయసులో దీపికా 6 సంవత్సరాలు పెద్దది. అదే రోజు మద్యాహ్నం దీపికా, నితీష్ కొన్ని నిమిషాల పాటు గొడవపడే సమయంలో తీసిన వీడియో కూడా దీపికా మొబైల్ లో రికార్డు అయ్యిందని పోలీసులు అన్నారు.
దీపికాను ఆమె స్నేహితుడు నితీష్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నితీష్ కూడా మాయం కావడంతో పోలీసులకు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. నితీష్ ను పట్టుకోవడానికి పోలీసులు మూడు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఇంటి నుంచి స్కూల్ కు వెళ్లిన అందమైన లేడీ టీచర్ పవిత్ర పుణ్యక్షేత్రం మేలుకోటేలో శవమై కనిపించడం కలకలం రేపింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications