అసెంబ్లీలోకి మాజీ సీఎంలు, మాజీ సీఎంల కొడుకులు ఎంట్రీ !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరి మద్దతు లేకుండానే దర్జాగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయ్యింది. ఆదివారం సాయంత్రం బెంగళూరులో సీఎల్ పీ సమావేశం నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకున్నారు.
సీఎల్ పీ సమావేశంలో కాబోయే సీఎం ఎవరు అనే విషయం డిసైడ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా స్పష్టం చేశారు. జస్ట్ ఫార్మాలిటీ కోసమే సీఎల్ పీ సమావేశం నిర్వహిస్తారని, సీఎం ఎవరు అనే విషయంపై ఢిల్లీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుందని తెలిసింది.

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి మే 15వ తేదీ సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రులుగా ఒక్కలిగ కులానికి చెందిన డీకే శివకుమార్, లింగాయత్ కులానికి చెందిన ఎంబీ. పాటిల్ దళితుల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ లేదంటే కేంద్ర మాజీ మంత్రి కేహెచ్. మునియప్పను నియమించే అవకాశం ఉందని ఢిల్లీలో పలుకుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. మేధావులు మట్టికరిచారు. ఐదు మంది సీనియర్ సిటిజన్స్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రులు, మాజీ సీఎంల కుమారులు, చాలా తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీ అడుగు పెడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ స్పీకర్లు ఓడిపోయి ఇంటికే పరిమితం అయ్యారు.
ఎక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేలు
* శామనూరు శివశంకరప్ప (92)
* జి. హంపయ్య నాయక్ (84)
* ఎంవై. పాటిల్ (82)
* హెచ్ వై. మేటి (77)
* ఆర్ వీ . దేశ్ పాండే (76)

తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేలు
* దర్శన్ ద్రువనారాయణ్ (28)
* ధీరజ్ మునిరాజు (31)
* నారా భరత్ రెడ్డి (33)
* డాక్టర్ చంద్రులామణి (34)
* అవినాష్ జాధవ్ (34)
* జీ.డీ. హరీష్ గౌడ (36)
* డాక్టర్ మంథర్ గౌడ (38)
* ప్రదీప్ ఈశ్వర్ (38)
* బెంగళూరు ప్రియా కృష్ణ (39)
* స్వరూప్ ప్రకాష్ (40)
అసెంబ్లీలో అడుగు పెడుతున్న మాజీ సీఎంల కుమారులు
* బసవరాజ్ బోమ్మయ్
* హెచ్ డీ. కుమారస్వామి
* హెచ్ డీ. రేవణ్ణ
* దినేష్ గుండూరావ్
* మధు బంగారప్ప
* బీవై. విజయేంద్ర
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ స్పీకర్లు
* కేఆర్ రమేష్ కుమార్
* జగదీష్ శెట్టర్
* కేజీ. బోపయ్య
* విశ్వేశ్వర హెగ్డే హాగేరి












Click it and Unblock the Notifications