జాక్ పాట్: యోగి క్యాబినెట్ లో రీట బహుగుణకు స్థానం, బిజెపిలో చేరిన కొద్ది రోజులకే మంత్రి పదవి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో:అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన సీనియర్ రాజకీయ నాయకురాలు రీట బహుగుణ జోషి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకొన్నారు.

సుదీర్ఘకాలం పాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. బిజెపిలో చేరిన రీట బహుగుణ మంత్రిగా ఆదివారం నాడు ప్రమాణం చేశారు.

లక్నో కంటోన్మెంట్ స్థానం నుండి ఆమె బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణయాదవ్ పై ఘన విజయం సాధించారు.

former congress leader rita bahuguna takes oath as minister in yogi adityanath's cabinet

2007 నుండి 2012 వరకు ఆమె ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పిసిసి చీఫ్ గా పనిచేశారు.కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిదిగా రీటా పనిచేశారు. ఆమె తండ్రి హేమవతీ నందన్ బహుగుణ , మాజీ ముఖ్యమంత్రి రీటా సోదరుడు విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.గత ఏడాది అక్టోబర్ లో రీటా కాంగ్రెస్ కాంగ్రెస్ ను వీడి బిజెపి తీర్థం పుచ్చుకొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
former congress leader rita bahuguna takes oath as minister in yogi adityanath's cabinet on sunday. rita bahuguna resigned congress party , joined in bjp before assembly elections.
Please Wait while comments are loading...