కిడ్నాప్, దోపిడీలు: మాజీ పోలీసు అధికారి అరెస్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కిడ్నాప్, దోపిడీల కేసుల్లో మాజీ పోలీసు అధికారిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీగా పని చేస్తూ రిటైడ్ అయిన బాబు నరోహ అనే ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

రూ. 80 లక్షల గోల్ మాల్ కేసులో ఈయన కింగ్ పిన్ అని బెంగళూరులోని జేపీ నగర పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఓ దోపిడీ కేసులో జేపీనగర పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో మాజీ డీఎస్పీ బాబు నరోహ పేరు బయటకు వచ్చింది.

దేశంలో పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత మాజీ డీఎస్పీ బాబు నరోహ తన చేతివాటం చూపించడానికి సిద్దం అయ్యారు. 20 శాతం కమీషన్ తో పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇస్తామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను నమ్మించారు.

Former cop accused of heist, arrested in Bengaluru

మాజీ డీఎస్పీ బాబు ఇలా బిగ్ షాట్ లను టార్గెట్ చేసుకున్నాడు. ఎలాగైనా రియల్ వ్యాపారులను మోసం చెయ్యాలని ప్లాన్ వేశారని తెలిసింది. గత గురువారం అక్షయ్ అనే వ్యక్తి వ్యాపారి సతీష్ కు ఫోన్ చేశాడు.

మా దగ్గర రూ. 1 కోటి (రూ.1,000, రూ.500) నోట్లు ఉన్నాయని, ఆ డబ్బును కొత్తనోట్లుగా మార్చి ఇవ్వాలని చెప్పాడు. రూ. ఒక కోటి పాత నోట్లు మార్చి ఇస్తే రూ. 20 లక్షలు కమీషన్ ఇవ్వాలని అక్షయ్, సతీష్ మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు.

శివరామ్, సతీష్ స్నేహితులు. అదే రోజు సాయంత్రం జేపీ నగర్ లో ఉన్న సతీష్ ఇంటికి అక్షయ్ వెళ్లాడు. అక్కడ డబ్బు రెడీగా ఉన్న విషయం గుర్తించాడు. వెంటనే తన స్నేహితులైన ఇద్దరికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు.

తరువాత పోలీసులు అక్కడికి వెళ్లి సతీష్, శివరామ్, అక్షయ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారిలో అక్షయ్ అనే వ్యక్తి రిటైడ్ డిప్యూటీ సూపరింటెండ్ (డీఎస్పీ) బాబు నరోహ ఐడీ కార్డు చూపించడంతో పోలీసులు షాక్ కు గురైనారు. ఈ ముగ్గురికి మాజీ డీఎస్పీతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అని పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Retired Deputy Superintendent of Police, Babu Noronha was arrested by Bengaluru police on Wednesday over allegations of kidnap and robbery. The retired cop allegedly masterminded a Rs 80 lakh heist.
Please Wait while comments are loading...