మళ్లీ రోడ్డు మీదికి వచ్చిన గృహలక్ష్మి మాజీ ఎడిటర్
ముంబై: గృహలక్ష్మి మరాఠీ మహిళా పత్రిక మాజీ సంపాదకురాలు సునీతా నాయక్ మళ్లీ రోడ్డు మీదికి వచ్చారు. నెల రోజుల క్రితం ఆమె ఇంటికి మారారు. 65 ఏళ్ల ఆమె స్థానిక గురుద్వారా సమీపంలోని పేవ్‌మెంట్ మీదికి చేరుకున్నారు.
అన్నీ పోగొట్టుకుని వీధిలో పడిన సునీతా నాయక్‌కు గ్రెగోరి, క్రిస్టినే మిస్క్యుట్టా దంపతులు గత నెలలో విలే పార్లెలో ఆశ్రయం కల్పించారు. ఆమె అంతటే ఆమె అక్కడి నుంచి సెప్టెంబర్ 16 -17 తేదీల్లో వెళ్లిపోయిందని, ఇది చాలా చేదు అనుభవమని, ఆమె డిమాండ్లకు అంతు లేకుండా ఉందని గ్రెగొరి మిస్క్యుట్టా అన్నారు.

సునీతా నాయక్ తన కుక్కతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి వెరసోవా అవతల ఆరాంనగర్ గురుద్వారా పేవ్‌మెంట్ మీదికి తిరిగి చేరుకుంది. ఓ స్థానిక దినపత్రికలో వచ్చిన వార్తాకథనం చదివి గ్రెగోరి ఆమెను ఆగస్టు 20వ తేదీన ఇంటికి తీసుకని వచ్చారు.
తను హృదయపూర్వకంగా ఆమెను తన ఇంటికి ఆహ్వానించానని, ఆమె ప్రతి రోజు మటన్ కావాలని కోరడం ప్రారంభించిందని, ఓసారి తెచ్చిపెట్టానని, కానీ ప్రతి రోజూ అంటే తన వల్ల కావడం లేదని, దాంతో పాటు ఆమెతో చాలా సమస్యలున్నాయని గ్రెగొరీ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. కుక్కకు ఆమె క్రోసిన్ మాత్రలు ఇచ్చిందని, దానికి ఆ మాత్రలు కావాలా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications