రాసింది పది.. పాసైంది ఇంటర్! వారెవా.. తండ్రీకొడుకులు ఇద్దరూ ఇద్దరే!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎవరైనా పదో తరగతి పరీక్షలు రాస్తే.. ఇంటర్ పాసవుతారా? అదీ ఏ గ్రేడ్‌లో. మిగిలిన వారి సంగతి ఏమో కానీ హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మాత్రం పాసయ్యారట. ఎలాగంటే...

జాతీయ సార్వత్రిక పాఠశాల (ఎన్‌ఐవోఎస్)లో పదో తరగతి పరీక్షలు రాసిన ఆయన ఇంటర్ ఏ గ్రేడ్‌లో పాసైనట్టు ప్రకటించుకున్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఎన్‌ఐవోఎస్ పది, ఇంటర్ ఫలితాలు ఇంకా వెలువడనే లేదు. 

82ఏళ్ల వయస్సులో తీహార్ జైలులోనే ఇంటర్ పూర్తి చేసిన మాజీ సీఎం!

Former Haryana Chief Minister Om Prakash Chautala passes Class XII exam with first division

హర్యానాలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో చౌతాలా దోషిగా తేలడంతో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం చౌతాలా తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

తన తండ్రి తీహార్ జైలులో ఏర్పాటు చేసిన పరీక్ష కేం ద్రంలో గత నెల ఎన్‌ఐఓస్ ఇంటర్ పరీక్షలు రాసి పాసయ్యారని, 82 ఏళ్ల వయసులోనూ ఏ గ్రేడ్ సాధించారని చౌతాలా కొడుకు అభయ్ సింగ్ ఇటీవలే మీడియాకు వెల్లడించారు.

అయితే చౌతాలా అడ్మిషన్ తీసుకున్నది, రాసింది పదో తరగతి పరీక్షలని.. ఎన్‌ఐవోఎస్ అధికారులు స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఇంటర్ ఎలా పాసవుతారని కూడా వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నిజానికి తాము ఇంకా టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల చేయనేలేదని, ఈ నెలాఖరులో వాటిని విడుదల చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. మొత్తానికి ఈ తండ్రీ కొడుకుల తెలివితేటలే వేరప్పా!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior INLD leader and younger son Abhay Singh Chautala said, “My father appeared for the Class XII examination conducted by the National Institute of Open Schooling at the centre set up for prisoners at Tihar Jail. He was on parole at that time, but as the examination centre was inside the jail, he went back to jail and sat for the examination,” Abhay said. He added that “ For the last four-and-a-half years, my father has been in jail and thus he thought of putting his time to use and thought to study since he had to discontinue during his earlier days due to family circumstances.’’
Please Wait while comments are loading...