బాలికపై మాజీ ఉద్యోగి రేప్: పశ్చాతాపంతో ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఉన్నతస్థాయి ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తాను చేసిన పనికి సిగ్గుపడుతూ మనస్థాపంతో కుంగిపోయాడు. ఆ వేదన భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. భారతీయ విమానయాన రంగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి (62) పక్కింటి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ట్యూషన్‌కి వెళ్లి ఇంటికి వస్తున్న బాలికను లోనికి పిలిచి దారుణానికి పాల్పడ్డాడు.
ఎవరికీ చెప్పొద్దని, కావాలంటే అడిగిన బహుమతులు ఇస్తానంటూ మభ్యపెట్టి పంపేశాడు. ఆ తర్వాత.. తాను చేసిన దారుణానికి పశ్చాత్తాపంతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తాను చేసిన ఆఘాయిత్యాన్ని, ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని తన సోదరుడికి ఫోన్ ద్వారా చెప్పాడు.

తాను చాలా పెద్ద తప్పు చేశానని, తమ ముఖాన్ని సమాజానికి చూపలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. కాగా, బాలికను గమనించిన తల్లిదండ్రులు వివరాలు ఆరాతీశారు.
కానీ, అప్పటికే ఆ అధికారి అక్కడి నుంచి పరారవ్వడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ అధికారి ఆత్మహత్య సమాచారం తమకు అందిందని పోలీసులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications