మోదీ స్కెచ్, రంగంలోకి దిగిన మాజీ సీఎం, సిట్టింగ్ సీఎంకు సినిమా చూపించాలని ప్లాన్, అదే జరిగితే ?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఘోరంగా ఓడిపోయిన పాత మైసూర్ ప్రాంతం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు సైలెంట్‌గా సన్నాహాలు జరుగుతున్నాయి. పాత మైసూర్‌లో దళపతుల పార్టీ జేడీఎస్ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పుంజుకోవాలని జేడీఎస్ నాయకులు ప్లాన్ చేస్తున్నారు.
పాత మైసూర్ తో సహా ఇతర ప్రాంతాల్లో జేడీఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరేందుకు మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని తెలిసింది. అందుకు తగ్గట్టుగానే మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామిని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీలో దింపితే ఎలా ఉంటుంది అని చర్చలు జరుగుతున్నాయి.

మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పోటీకి అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలి అని జేడీఎస్ లో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ గెలిచే నియోజకవర్గాలపై కూడా కుమారస్వామి జేడీఎస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా చిక్కమగళూరు జిల్లాలోని మల్లెనహళ్లిలోని హనీ డ్యూ రిసార్ట్‌లో పాత మైసూరు ప్రాంతం జేడీఎస్ నేతలతో సీరియస్‌గా చర్చించినట్లు సమాచారం. మండ్య మాజీ ఎంపీ పుట్టరాజుతోపాటు పలువురు నేతలు ఇదే రిసార్ట్‌లో కుమారస్వామితో చర్చలు జరిపారని తెలిసింది.
బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే సా.రా.మహేష్, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) ఎస్.ఎల్. భోజెగౌడ్, బాలకృష్ణతో మాజీ సీఎం కుమారస్వామి చర్చించినట్లు తెలిసింది. మాజీ సీఎం కుమారస్వామి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఇప్పటికే చాలా ఒత్తిడి జరిగింది. ఎమ్మెల్సీ ఎస్ఎల్ భోజెగౌడ కూడా బీజేపీ గెలిచే నియోజకవర్గాలలో కుమారస్వామి పోటీ చేస్తారని సంకేతాలు ఇచ్చారు. మండ్య, తుమకూరు, చిక్కబళ్లాపూర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట కుమారస్వామి పోటీకి దింపాలని జేడీఎస్ నేతలు, కార్యకర్తలు ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుమారస్వామి బీజేపీ- జేడీఎస్ కూటమి నుంచి నాలుగు నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీపై కుమారస్వామి పలువురు బీజేపీ నేతలు, మండ్య ఎంపీ సుమలతా అంబరీష్ కు అత్యంత సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. అలాగే బెంగళూరు రూరల్, మండ్య, చిక్కబళ్లాపురం నియోజకవర్గాల్లో పోటీపై సర్వే చేయనున్నట్టు చెబుతున్నారు.
మండ్య నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే దృక్పథంతో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పోటీ చేస్తే బీజేపీ- జేడీఎస్ కూటమి అభ్యర్థులకు మరింత బలం చేకూరుతుందని బీజేపీ నేతలు చర్చించుకున్నారని తెలిసింది. బీజేపీ హైకమాండ్ కూడా లోక్ సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొత్తం మీద కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో చుక్కలు చూపించాలని బీజేపీ, జేడీఎస్ నాయకులు పక్కాప్లాన్ చేస్తున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications