మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యేకి హైకోర్టులో షాక్, అక్రమ ఆస్తుల కేసులో ?, మైండ్ బ్లాక్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ తహతహలాడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలా మందికి మరోసారి పోటీ చెయ్యడానికి చాన్స్ వచ్చింది. అయితే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండు జాబితాల్లో చాన్స్ చిక్కలేదు.
బెంగళూరులోని చామరాజపేట నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జమీర్ అహహమ్మద్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా తన మీద నమోదు అయిన అక్రమాస్తుల కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
తన మీద ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు విచారణ జరగకుండా స్టే విధించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ సమర్పించిన పిటీషన్ ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. నటరాజ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బెంచ్ విచారణ జరిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ కేసులో స్టే ఇవ్వడానికి నిరాకరించిన కర్ణాటక హైకోర్టు ఆయన సమర్పించిన పిటీషన్ ను కొట్టి వేసింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో ఏసీబీ దెబ్బకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కు ఇప్పుడు హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో ఆయన మైండ్ బ్లాక్ అయ్యింది.
కర్ణాటకలో రెండుసార్లు మంత్రిగా పని చేసిన జమీర్ అహమ్మద్ మొదటి సారి జేడీఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కుమారస్వామి మంత్రి వర్గంలోనే జమీర్ ఖాన్ మంత్రి అయ్యారు. తరువాత జేడీఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జమీర్ అహమ్మద్ కాంగ్రెస్ లో చేరి మరోసారి మంత్రి అయ్యారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని జమీర్ అహమ్మద్ మీద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే కేసు కోర్టులో విచారణ జరుగుతుండటంతో జమీర్ అహమ్మద్ ఖాన్ స్టే కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications