సీఎం సిద్దరామయ్య గురించి క్లారిటీగా చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పథకాలు అమలు అవుతాయని అనుకున్నాం అని, కాని అది జరగలేదని, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని కొంతకాలం మేము వేచి చూస్తాం అని కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
గురువారం గంగావతిలో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలు పంపిణీ చేసిన అనంతరం గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రకటనలు అమల్లోకి వస్తాయని ఆ పార్టీ నాయకులు తెలిపారని మాజీ మంత్రి కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పథకాలు అమలు కావడంలేదని, మళ్లీ వాయిదా పడుతోందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. త్వరలో తాను సీఎం సిద్దరామయ్యతో సమావేశం అవుతానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. సిద్ధరామయ్య మామూలు ముఖ్యమంత్రి కాదని, ఆయన గతంలో అనేక సంవత్సరాలు ఆర్థిక శాఖను నిర్వహించారని, ఆయన ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి ఎలా ఉంటుందో కొంతకాలం వేచి చూద్దాం అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
సిద్దరామయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో లేదో వేచి చూస్తామని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ దేశంలోనే అత్యుత్తమ బడ్జెట్ ఇచ్చిన రాజకీయ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. ఆయనకు మంచి అవగాహన ఉందని, కర్ణాటక అభివృద్ధి, హామీ పథకాలు ఇస్తామని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
గ్యారంటీ పథకాల్లో భాగం అయిన అన్న భాగ్య పథకం కింద 10 కిలోల బియ్యాన్ని అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా కర్ణాటకకు బియ్యం సరఫరా చేసే హక్కు గంగావతికి ఉంది. గంగావతి నుంచి ప్రభుత్వం బియ్యాన్ని కొనుగోలు చేస్తుందని తాను నమ్ముతున్నానని, బియ్యం ఇక్కడి నుంచి కొనుగోలు చెయ్యలని తాను ప్రభుత్వానికి మనవి చేస్తున్నానని, ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనాల్సిన అవసరం లేదని, మన గంగావతి నుంచే బియ్యం సరఫరా చేద్దామని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి స్థానిక ప్రజలకు చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications