Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాలి జనార్దన్ రెడ్డి పక్కాప్లాన్, ఆ డిమాండ్లతో బీజేపీలో వినీలం ?, భార్యకు అగ్రస్థానం, ఆ లీడర్ కు షాక్ !

కర్ణాటక మాజీ మంత్రి, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధినేత, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి లోక్ సభ ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానిగా చూసేందుకు కేఆర్ పీపీకి చెందిన పలువురు పార్టీ నాయకులతో కలిసి బీజేపీలో చేరుతున్నట్లు గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. సోమవారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో గాలి జనార్దన్ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరారు.

కేఆర్ పీపీ పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్ధన్ రెడ్డి సోమవారం బెంగళూరులో మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, బీవై విజయేంద్ర, మాజీ మంత్రి శ్రీరాములు సమక్షంలో బీజేపీలో చేరారు. బీవై విజయేంద్ర జనార్దన్ రెడ్డికి పార్టీ జెండాను ఇచ్చి తిరిగి బీజేపీలోకి ఆయనకు స్వాగతం పలికారు. కేఆర్పీపీని కూడా బీజేపీలో విలీనం చేశారు. తాను ఎలాంటి డిమాండ్లతో బీజేపీలో చేరడం లేదని, సామాన్య కార్యకర్తగా బీజేపీలో చేరుతున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు.

Former minister Gali Janardhan Reddy made some demands before joining BJP

అయితే మాజీ మంత్రి, కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్లు ఉన్నాయని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీలో చేరే ముందు ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి 200 మందికి పైగా కేఆర్ పీపీకి చెందిన నాయకులతో సమావేశమయ్యారని తెలిసింది. కేఆర్ పీపీ నాయకుల అంగీకారం మేరకే తాను బీజేపీలో చేరాలని గాలి జనార్దన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తరువాత కర్ణాటకలోని బీజేపీ నేతలతో గాలి జనార్దన్ రెడ్డి చర్చలు జరిపారు. ఇప్పుడు ఆ 200 మంది నాయకులతో పాటు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా గాలి జనార్దన్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో చర్చలు జరిపారు. ఈసారి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ పెద్దల ముందు పలు డిమాండ్లు చేశారని తెలిసింది. అందులో ముఖ్యమైనది లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఒక్క ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారని సమాచారం. కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని మార్చాలని, అదే విధంగా ఆ నియోజకవర్గం నుంచి తన సతీమణి లక్ష్మీ అరుణకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని బీజేపీలో విలీనమైన కల్యాణ్ రాజ్య ప్రగతి పార్టీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి కోరినట్లు సమాచారం.

కర్ణాటకలోని బళ్లారి, కొప్పళ, రాయచూర్, విజయనగరం జిల్లాల్లో పట్టు సాధించిన గాలి జనార్దన్ రెడ్డి, ఆయన తన మద్దతుదారులందరినీ తనతో పాటు బీజేపీలో చేర్చుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి చేరికతో బీజేపీకి ఏం లాభం అని చాలా మంది అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి పార్టీలో చేరడం వల్ల బళ్లారి, కొప్పళ, రాయచూరు, గదగ్, హావేరి జిల్లాల్లో బీజేపీ బలం పుంజుకుంది. ఈ నియోజకవర్గాల్లో ఆధిక్యత సాధించేందుకు బీజేపీ ఇప్పటికే నానా తంటాలు పడుతోంది.

Former minister Gali Janardhan Reddy made some demands before joining BJP

ఇప్పుడు మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి ఆ జిల్లాల్లో మంచి పునాది ఏర్పడింది. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డితో పాటు కేఆర్ పీపీ కూడా బీజేపీలో విలీనం అయిపోయింది. బళ్లారి, కొప్పల్, రాయచూర్, చిత్రదుర్గ నియోజకవర్గాల్లోని 20 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాలి జనార్దన్ రెడ్డి తన ప్రభావం చూపనున్నారు. ఈ ప్రాంతాల్లో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా బీజేపీ తన పరిధిని విస్తరించుకోవచ్చు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డిని విస్మరించిన బీజేపీకి ఈ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. కాబట్టి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో అలాంటి తప్పు చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు. గాలి జనార్దన్ రెడ్డి చరిష్మాను ఉపయోగించుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఏప్రిల్ 26వ తేదీన, మే 7 తేదీల్లో రెండు దశల్లో లోక్ సభ పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన దేశంలోని అన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+