మాజీ మంత్రి కొడుకు, లా కాలేజ్ ఓనర్, భార్యకు చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏం చేశాడంటే ?
రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి తరువాత మంత్రిగా పని చేశారు. మంత్రిగా పని చేసిన ఆ నాయకుడి పేరుతోనే ఐటీ హబ్ లో ఓ లేఔట్, లా కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు. లేఔట్ మొత్తానికి ఆయన పేరు పెట్టారు. మంత్రిగా పని చేసిన వ్యక్తికి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు పెళ్లి చేసుకోవడంతో వాళ్లకు పుట్టిన పిల్లలు కూడా పెళ్లి చేసుకున్నారు. సొంతంగా కాలేజ్ నిర్వహిస్తున్న మాజీ మంత్రి కుమారుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
కర్ణాటక రాజకీయాల్లో ఎల్ జీ హవనూరు అనే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సంవత్సరాల క్రితం కర్ణాటక రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హవనూరు తరువాత కర్ణాటక న్యాయశాఖా మంత్రిగా పని చేశారు. బెంగళూరులోని బాగల్ గుంటే ప్రాంతంలో హవనూరు అనే పేరుతో పెద్ద లేఔట్ కూడా ఉంది. తరువాత ప్రభుత్వాలు మారిపోవడంతో హవనూరుకు మంత్రి పదవిపోయింది. ఇదే హవనూరు లేఔట్ లో మాజీ మంత్రి హవనూరు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.

హవనూరుకు అశోక్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మాజీ మంత్రి హవనూరు మరణించారు. మాజీ మంత్రి హవనూరు కుమారుడు అశోక్, ఆయన కుటుంబ సభ్యులు హవనూరు లేఔట్ లో నివాసం ఉంటున్నారు. కర్ణాటక మాజీ న్యాయశాఖ మంత్రి దివంగత ఎల్‌జీ హవనూరు కుమారుడు అశోక్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులోని బాగల్‌గుంటే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హవనూరు లేఅవుట్‌కు చెందిన అశోక్ హవనూరు (62) ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అశోక్ ఆయన గదిలోకి వెళ్లి తరువాత బయటకు రాలేదు. తరువాత అశోక్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆయన గదిలో కిటికీలలో చూడటంతో అశోక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి హవనూరు కుమారుడు అశోక్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలీదని పోలీసు అధికారులు అంటున్నారు.

దీనికి సంబంధించి బెంగళూరు పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడు అశోక్ బెంగళూరులోని రామమూర్తినగర్‌లోని హవనూరు న్యాయ కళాశాల (లా కాలేజ్ ) నిర్వహిస్తున్నాడు. గత 15 రోజులుగా మాజీ మంత్రి కుమారుడు అశోక్ కుటుంబ సభ్యులతో పాటు కాలేజ్ లో పని చేసే ఉద్యోగులు, విద్యార్థులతో సహ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదని వెలుగు చూసింది.
ఇంట్లో, కాలేజ్ లో ఎప్పుడూ గదిలోనే ఒంటరిగా గడిపేవాడని తెలిసింది. ఆదివారం సాయంత్రం కూడా అశోక్ గదిలోకి వెళ్లి ఒంటరిగా ఆ గదిలో ఉన్నాడని, తరువాత ఆయన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీలో చూడగా ఫ్యాన్ కు వైర్ తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెలుగు చూసింది. అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications