మోదీతో మాజీ ప్రధాని చర్చలు, ఆ సీట్లు మాకు ఇస్తారా ?, మీరో పోటీ చేస్తారా ?, ఆ మ్యాటర్ లో డీల్ !

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తి అయిన తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ముమ్మరంగా రంగం సిద్ధం చేసుకుంటున్నది. లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో జేడీఎస్ పార్టీ చీఫ్ తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతల భేటీ అత్యంత కీలకంగా మారింది.

పార్లమెంట్ హౌస్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సమావేశమయ్యారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో చాలా సేపు పలు అంశాలపై చర్చించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు పలు అంశాలపై చర్చించారు.

Former PM HD Deve Gowda and former CM Kumaraswamy met Prime Minister Narendra Modi,

ప్రధాని మోదీతో భేటీ అనంతరం మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్, బీజేపీల మధ్య సీట్ల కేటాయింపు విషయంలో ఎలాంటి సమస్య, గందరగోళం లేదని అన్నారు. ఎవరెవరు ఏ నియోజక వర్గంలో పోటీ చేస్తారో అంతా కలిసి కూర్చొని ఖరారు చేస్తారని, ఈ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సమస్య లేదని, సీట్ల కేటాయింపు విషయంలో ఎక్కువ లేదా తక్కువ కావచ్చు అని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

Former PM HD Deve Gowda and former CM Kumaraswamy met Prime Minister Narendra Modi,

జనవరి నెలాఖరులోగా లోక్ సభ ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చెయ్యాలనే విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని కుమారస్వామి చెప్పారు. దేవెగౌడ, తాను, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, తన సోదరుడు రేవణ్ణ, బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోదీని కలిశామని కుమారస్వామి వివరించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో విడివిడిగా పలు అంశాలపై చర్చించామని కుమారస్వామి వివరించారు.

దేవెగౌడ అంటే మోదీకి చాలా గౌరవం అని, మా కుటుంబంపై ప్రధాని మోదీకి నేటికీ నమ్మకం తగ్గలేదని, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ నాకు ఎన్నో మంచి సూచనలు చేశారని మాజీ సీఎం కుమారస్వామి సంతోషం వ్యక్తం చేశారు. పార్లమెంట్ హౌస్‌లో యువకులు పొగ బాంబులు విసిరిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున దుమ్మెత్తి పోసి పార్లమెంట్ కార్యక్రమాలను చెడగొట్టడం, అడ్డుకోవడం సరికాదని మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+