Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా పాజిటివ్ -ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు -వ్యాక్సిన్ తీసుకున్నా ఇన్ఫెక్షన్

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతోందనడానికి నిదర్శనంగా టాప్మోస్ట్ రాజకీయ నేతలు సైతం ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్ వ్యాధితో ఐసోలేషన్ కు పరిమితం కాగా, భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ వెటరన్ మన్మోహన్ సింగ్ (88) అనూహ్య రీతిలో కరోనా వైరస్ బారినపడ్డారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ అని సోమవారం నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం ఆయనను ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు. నిజానికి మన్మోహన్ సింగ్ దంపతులు మార్చి 4న ఇదే ఎయిమ్స్ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. రెండో డోసు తీసుకోవాల్సి ఉండగా, అంతలోనే సింగ్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.

 Former PM Manmohan Singh admitted to AIIMS Delhi after testing positive for Covid-19

కొవిడ్ వ్యాధితో మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితిని ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా, మన్మోహన్ ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకుని ఉన్నందున వ్యాధి నుంచి తొందరగానే ఉపశమనం పొందే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. అందులో..

రానున్న ఆర్నెల్ల టార్గెట్‌కు అనుగుణంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు ఆర్డర్లు ఇవ్వాలని, వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను నిర్ణయించుకునే అధికారమూ రాష్ట్రాలకే వదిలేయాలని, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో కంపెనీలకు 'లైసెన్సింగ్‌ తప్పనిసరి' నిబంధనను కొంతకాలం తొలగించాలని, టీకా తయారీ దారులకు ప్రోత్సాహకాలు అందించాలని, యూరప్, అమెరికా ఎఫ్‌డీఏ వంటి సంస్థలు ఆమోదించిన టీకాలను దిగుమతి చేసుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన లేఖలో మోదీకి సూచించడం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+