మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం వెలువడింది. డెంగ్యూతో బాధపడుతూ కొద్దిరోజుల కిందట ఆయన దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో అడ్మిట్ అయ్యారు. అక్కడే చికిత్స పొందారు. ఆయన ఆసుపత్రిలో చేరారనే విషయం తెలిసిన వెంటనే ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి, ఉజ్వలంగా నిలబెట్టిన మన్మోహన్ సింగ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలంటూ ప్రత్యేక పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల అకాంక్షలు, ప్రార్థనలు ఫలించాయి. మన్మోహన్ సింగ్.. సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన డిశ్చార్జ్ అయ్యారని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ సింగ్ తెలిపారు.

Former PM Manmohan Singh reaches home, recovering from Dengue, says wife Gursharan Kaur

ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. డెంగ్యూ బారిన పడటంతో మన్మోహన్ సింగ్ కిందటి నెల 13వ తేదీన ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఇదివరకు కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లోనే చికిత్స పొందిన విషయం తెలిసిందే. కరోనాను జయించారు మన్మోహన్ సింగ్. ఈ దఫా డెంగ్యూతోనూ పోరాడారు. విజయం సాధించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు.

మన్మోహన్ సింగ్ క్షేమంగా తిరిగి రావాలంటూ కోరుకున్న ప్రతి ఒక్కరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని గురుశరణ్ కౌర్ అన్నారు. ఆయనకు నాణ్యమైన వైద్యాన్ని అందించిన ఎయిమ్స్ డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, ఇతర సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. 89 సంవత్సరాల వయస్సున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా బారిన పడి, కోలుకున్నారు.

కాగా- దేశ రాజధానిలో డెంగ్యూ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా 1,530 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీని బారిన పడి ఆరుమంది మరణించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ.. ఈ ఉదయం ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి రాజేష్ భూషణ్.. ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. డెంగ్యూ తీవ్రతను నివారించడానికి తీసుకున్న, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+