వాజపేయికి మోడీ, అద్వానీ, రాహుల్‌గాంధీ, అమిత్ షా పరామర్శ, ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా
న్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని పరామర్శించేందుకు నేతలు క్యూ కట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను పరామర్శించారు.
నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులు పరామర్శించారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా పరామర్శించారు. నరేంద్ర మోడీ.. వాజపేయి వద్ద 45 నిమిషాల పాటు గడిపారు.

కేంద్రమంత్రి జేపీ నడ్డా కూడా ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరిన వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. వాజ్‌పేయికి అందుతోన్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు, వాజ్‌పేయీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్ సంచాలకుడు డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఆయనకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చేరినట్టు వైద్యులు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఎయిమ్స్ సంచాలకులు డా.రణ్‌దీప్ గులేరియా ఆధ్వర్యంలో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. అల్జీమర్స్ కొంతకాలంగా బాధపడుతున్న వాజ్‌పేయి రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు.
వాజపేయి ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా
వాజపేయి అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ అధికారులతో మాట్లాడారు. వాజపేయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారుల నుంచి వాజపేయి ఆరోగ్యంపై ఆరా తీశారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications