పంజాబ్ మాజీ డిజిపి కెపిఎస్ మృతి
మాజీ పంజాబ్ డిజిపి కెపిఎస్ గిల్ న్యూఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించాడు. ఆయన వయస్సు 82 ఏళ్లు.
ఛండీఘడ్: మాజీ పంజాబ్ డిజిపి కెపిఎస్ గిల్ న్యూఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించాడు. ఆయన వయస్సు 82 ఏళ్లు.
పంజాబ్ రాష్ట్రానికి ఆయన రెండు దఫాలు డిజిపిగా పనిచేశారు.ఈ రాష్ట్రంలో తిరుగుబాటుదారులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సమయంలో ఆయన డిజిపిగా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో సఫలీకృతులయ్యారు.

అంతేకాదు తిరుగుబాటుదారులను ఏరివేశారు.1995 లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. గిల్ భారత హకీ ఫెడరేషన్ కు అధ్యక్షుడిగా కూడ పనిచేశారు.
విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఆయనకు పద్మశ్రీ లభించింది. ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం పద్మశ్రీతో ఆయనను సత్కరించింది.
అతడిని సూపర్ కాప్ గా అభివర్ణిస్తారు. పంజాబ్ రాష్ట్రానికి 1988 నుండి 1990 వరకు డిజిపిగా పనిచేశారు. అయితే 1991 నుండి ఆయన రిటైరయ్యేవరకు 1995 వరకు ఆయన డిజిపి పదవిలోనే కొనసాగారు.












Click it and Unblock the Notifications