బీజేపీకి ప్రచారం చేసిన కాంగ్రెస్‌ నేత

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గురువారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు విసృతంగా ప్రచారం నిర్వహించాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉండగా, మెజారిటీకి 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది అయితే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లపై త్రికోణ పోటీ నెలకొంది.

ఇదిలా ఉంటే నిన్నటి వరకు బీజేపీకి ప్రచారం చేసిన ఓ నేత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిర్సా మాజీ ఎంపీ అశోక్ తన్వర్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, భూపిందర్ సింగ్ హుడా సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. గురువారం మహేందర్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అశోక్ తన్వర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Former Sirsa MP Ashok Tanwar rejoined the Congress party

గతంలో హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తన్వర్ 2019లో వివాదంతో పార్టీని వీడారు. ఆ తర్వాత, అతను నవంబర్ 2021లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు. ఆ తర్వాత ఏప్రిల్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మారారు.ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. జింద్ జిల్లా సఫిడాన్‌లో బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారం చేసిన కొద్ది గంటలకే తన్వర్ తిరిగి కాంగ్రెస్‌లోకి చేరారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించే సమయంలో, అభిమానులను వేచి ఉండమని కోరుతూ ఒక ప్రకటన చేశారు.

కొద్దిసేపటి తర్వాత, తన్వర్ వేదికపై కనిపించారు. రాహుల్ గాంధీతో కరచాలనం చేస్తూ, హుడాకు అభివాదం చేస్తూ తన్వర్ తిరిగి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా హుడా మద్దతుగా అతని వీపుపై తట్టారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో , సిర్సా నియోజకవర్గం నుంచి 35,499 మెజార్టీతో తన్వర్ విజయం సాధించారు. అయితే ఆయన 2014 ఎన్నికల్లో చరణ్‌జీత్ సింగ్ రోరీ చేతిలో 1.15 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో బీజేపీకి చెందిన సునీతా దుగ్గల్ చేతిలో 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీని వీడి పలు పార్టీలో చేరారు. చివరకు ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. అశోక్ తన్వర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+