సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత (ఫోటోలు)
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్(100) కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధతో గత శుక్రవారం కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.
జడ్జిగా మారిన సోషలిస్టు రాజకీయ నాయకుడిగా, న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ ఆందరినీ సమానంగా చూడాలన్న తపనతో పని చేశారు. కృష్ణయ్యర్ తమిళ బ్రాహ్మణుడిగా జన్మించినా, కేరళలో పుట్టి పెరిగారు. కృష్ణయ్యర్ తమిళ బ్రాహ్మణుడిగా జన్మించినా, కేరళలో పుట్టి పెరిగారు. 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికై, 1957లో కేరళలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు సర్కారులో న్యాయ మంత్రిగా 1959 వరకూ సేవలందించారు.
1973లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం కృష్ణ అయ్యర్ 1980 వరకు ఏడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. తరువాత న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. జూలై 1973లో సుప్రీం కోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో గౌరవించింది.
ఈ మధ్యనే నవంబర్ 15న కృష్ణ అయ్యర్ తన వందవ పుట్టిన రోజును జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ శుభాకాంక్షలు తెలిపారు. కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషణ్, సినీ గాయకుడు కె.జె ఏసుదాస్, రచయిత ఎం.కె సానూ తదితరులు కృష్ణయ్యర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ జడ్జి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత
ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు జస్టిస్ కృష్ణయ్యర్ గురవారం శత వసంతంలోకి అడుగుపెట్టారు. వాస్తవానికి ఆయన పుట్టినరోజు నవంబర్ 15 అయినా, భారత కేలండర్‌లోని నక్షత్రాల ప్రకారం గురువారం జరుపుకున్నారు.

మాజీ జడ్జి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత
నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న జన్మదిన వేడుకల కోచిలోని శివాలయంలో అయ్యర్ పూజలతో ప్రారంభమయ్యాయి. ఆనంతరం ఆయన కేక్ కత్తిరించారు. 'ఇంటర్నేషనల్ ఇంటర్ పెయిత్ డైలాగ్ ఇండియా' ఆధ్వర్యంలో వివిధ మతాలకు చెందిన పెద్దలతో ప్రార్ధనలు నిర్వహించారు.

మాజీ జడ్జి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత
ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ శుభాకాంక్షలు తెలిపారు. కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషణ్, సినీ గాయకుడు కె.జె ఏసుదాస్, రచయిత ఎం.కె సానూ తదితరులు కృష్ణయ్యర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ జడ్జి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ కన్నుమూత
కృష్ణయ్యర్ తమిళ బ్రాహ్మణుడిగా జన్మించినా, కేరళలో పుట్టి పెరిగారు. 1952లో ఎమ్మెల్యేగా ఎన్నికై, 1957లో కేరళలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు సర్కారులో న్యాయ మంత్రిగా 1959 వరకూ సేవలందించారు. తరువాత న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. జూలై 1973లో సుప్రీం కోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications