జయ ఆప్తుడైన ఐఏఎస్ కు గుండెపోటు: ఏం జరిగింది ?
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావుకు గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైనారు. వెంటనే ఆయన్ను చెన్నైలోని పోరూరు శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ ( ఆసుపత్రి)కి తరలించారు.
శ్రీ రామచంద్ర ఆసుపత్రిలోని అత్యవసర వార్డు (ఐసీయూ)లో రామ్మోహన్ రావు చికిత్స పొందుతున్నారు. తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

గత బుధవారం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు రామ్మోహన్ రావు ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ రావు, మరి కొందరి ఇళ్లలో సోదాలు చేశారు. ఆ సమయంలో మొత్తం రూ. 30 లక్షల విలువైన కొత్త రూ. 2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం రూ. 5 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల పత్రాలు, ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ రావును సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథన్ ను నియమించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత రామ్మోహన్ రావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications