కాంగ్రెస్ ఫస్ట్ గ్యారంటీ: అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు
Congress: దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

అదే సమయంలో ఉత్తరాదిన రైతులు ఉద్యమించడం ప్రాధన్యతను సంతరించుకుంది. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరను చెల్లించడం, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయడం, తమ డిమాండ్లను పరిష్కరించుకోవడానికి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఛలో ఢిల్లీ ఆందోళనను చేపట్టారు. దేశ రాజధానిని ముట్టించారు.
రైతులెవరూ ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోటీసులు అడ్డుకున్నారు. పంజాబ్, హర్యానా వైపు నుంచి ఢిల్లీలోనికి ప్రవేశించడానికి ఉద్దేశించిన మార్గాలన్నింటినీ మూసివేశారు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్.. మార్గాల్లో రోడ్డుకు అడ్డంగా సిమెంట్ దిమ్మెలను ఉంచారు. మేకులను అమర్చారు. పంజాబ్- హర్యానా మార్గంలోని శంభు బోర్డర్ వద్ద రైతులపై టియర్ గ్యాస్‌నూ ప్రయోగించారు పోలీసులు.
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే వెంటనే రైతులకు కనీస మద్దతు ధరను అమలు చేస్తామని ప్రకటించారు. ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసుల మేరకు దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు పండించిన ప్రతి పంటకూ కనీస మద్దతు ధరను చెల్లిస్తామని అన్నారు.
किसान भाइयों आज ऐतिहासिक दिन है!
— Rahul Gandhi (@RahulGandhi) February 13, 2024
कांग्रेस ने हर किसान को फसल पर स्वामीनाथन कमीशन के अनुसार MSP की कानूनी गारंटी देने का फैसला लिया है।
यह कदम 15 करोड़ किसान परिवारों की समृद्धि सुनिश्चित कर उनका जीवन बदल देगा।
न्याय के पथ पर यह कांग्रेस की पहली गारंटी है।#KisaanNYAYGuarantee
దీని వల్ల దేశంలో 15 కోట్ల మంది రైతులకు లబ్ది కలుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశానికి రైతులే వెన్నెముక అనే సూత్రాన్ని తాము బలంగా నమ్ముతున్నామని పేర్కొన్నారు. ప్రతి రైతు ఇల్లూ సుభిక్షంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన తొలి గ్యారంటీ ఇదేనని అన్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications