మగ నర్సు నిర్వాకం: మహిళా రోగిపై లైంగిక వేధింపులు

బెంగుళూరు: బాలికలు, యువతులే కాదు డెంగ్యూ వ్యాధితో తీవ్ర అస్వస్థతతో ఉన్న 54 ఏళ్ల మహిళకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. ఆమె మర్మాంగాలను తాకి, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు బెంగుళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రిలోని మగ నర్సు.

ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు కేవలం లైంగిక వేధింపుల కేసు మాత్రమే నమోదు చేశారు. దీనిపై బాధిత మహిళ కుటుంబసభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'అది సాంకేతికంగా అత్యాచారమే. అయినా పోలీసులే లైంగిక వేధింపుల కేసు మాత్రమే నమోదు చేశారు.' అని బాధితురాలి భర్త మీడియాకు తెలిపారు.

తాము బెంగుళూరు పోలీసులపై నమ్మకం కోల్పోయామని, ఈ ఘటన విషయమై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

అక్టోబర్ 5వ తేదీన డెంగ్యూ వ్యాధితో బాధిత మహిళ బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రిలోని హై డిపెండెన్సీ యూనిట్ (హెచ్‌డీయు)లో చేరింది. అర్ధరాత్రి సమయంలో ఆమె గదిలోకి వచ్చిన నర్సు శివకుమార్ ఆమె పట్ల లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డాడు.

'నా భార్య తీవ్ర అస్వస్థతతో ఉంది. అతడి లైంగిక దుశ్చర్యలతో ఆమె షాక్‌కు గురైంది. అతడు లైంగిక చర్యలకు పాల్పడుతుండటంతో రాత్రంతా నిద్రలేకుండా తీవ్ర అవస్థ అనుభవించింది. మోనిటర్‌ను స్విచ్ ఆఫ్ చేసి దూదితో నా భార్య ఛాతిని అతని చేతులతో తాకాడు.

Fortis Hospital molestation case: It’s rape, cry patient’s family

అనంతరం ఆమె కాళ్లకు మసాచ్ చేసే పేరిట ఆమె మర్మాంగాలను తాకడంతో పాటు, చేతి వేలితో అసభ్య చర్యలకు పాల్పడ్డాడు. ఇది అత్యాచారం కిందకు రాదా?' అని బాధితురాలి భర్త ప్రశ్నించాడు. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ వార్డులో ఆడ నర్సు ఉండగా, మగ నర్సు శివ కుమార్ ఆమె గదిలోకి వెళ్లాల్సిన అవసరం ఏమిుందని ప్రశ్నించాడు.

ఈ సంఘటలో ఫోర్టిస్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివకుమార్‌ను అరెస్టు చేశారు.

అయితే, అతనిపై రేప్ కేసు పెట్టకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు కేవలం 10 రోజుల్లోనే అతనికి బెయిల్ లభిచడంపై బాధితురాలి కుటుంబ సభ్యులు అసహానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+