రైల్వే మాజీ మంత్రి మిశ్రా హత్యకేసు: నిందితులకు యావజ్జీవ శిక్ష

న్యూఢిల్లీ: రైల్వే మాజీ మంత్రి ఎల్ఎన్ మిశ్రా హత్యకేసులో ఢిల్లీ న్యాయస్ధానం తుదితీర్పు వెలువరిచింది. ఎల్ఎన్ మిశ్రా హత్యకేసులో నిందితులకు ఢిల్లీ న్యాయస్ధానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది.

1975లో హత్యకు గురైన ఎల్ఎన్ మిశ్రా హత్య కేసులో 40 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తుదితీర్పు వెల్లడించడం విశేషం. వివరాల్లోకి వెళితే 1975 జనవరి 2న సమస్థిపూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమానికి మిశ్రా హాజరయ్యారు. ఈ సమయంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో తీవ్ర గాయాలతో మంత్రి మరణించారు.

Four accused pronounced guilty for causing railway minister’s death

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సుదీర్ఘ విచారణ నిర్వహించారు. ఈ సమయంలో 161 ప్రాసిక్యూషన్ సాక్షులు, మరో 40 మంది డిఫెన్స్ సాక్షులను విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నన్యాయవాది రంజన్ ద్వివేది వయసు అప్పట్లో 24 ఏళ్లు. ఈయనతో పాటు మరో నలుగురుని దోషులుగా ప్రకటించింది.

ఈ నలుగురిలో ఒకరు మరణించగా మిగిలిన ముగ్గురు సంతోషానంద అవధూత, సుదేవానంద అవధూత, గోపాల్‌జీ‌లుగా న్యాయస్ధానం పేర్కొంది. ఈ మర్డర్ కేసులో ఇప్పటికే నిందితులు అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టుని ఆశ్రయించగా తిరస్కరించింది. పాట్నాలోని సీబీఐ కోర్టులో నవంబర్ 1, 1977న ఛార్జ్‌షీట్ నమోదైంది. అప్పటి అటార్నీ జనరల్ కోరిక మేరకు ఈ కేసును 1979లో ఢిల్లీకి మార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+