చిన్నారులపై వరుస రేప్‌లు: గుర్గామ్‌లో ఆందోళన రేపుతోన్న వరుస ఘటనలు
కామాంధుల వికృత క్రీడలకు చిన్నారులు బలైపోతున్నారు. 'చిన్నారులపై లైంగిక దాడులు' గుర్గామ్ లో వరుసగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో.. స్థానికంగా కలకలం రేగుతోంది.
గుర్గామ్: కామాంధుల వికృత క్రీడలకు చిన్నారులు బలైపోతున్నారు. 'చిన్నారులపై లైంగిక దాడులు' గుర్గామ్ లో వరుసగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో.. స్థానికంగా కలకలం రేగుతోంది. చుట్టుపక్కల ఉండే చిన్నారులనే టార్గెట్ గా చేసుకుని కామాంధులు వారిపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు.
తాజాగా హరీందర్ అనే 19 ఏళ్ల యువకుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన గుర్గామ్‌లో షీత్లా మాత కాలనీలో వెలుగుచూసింది. బాలికకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర చిత్రాలను తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకిరించి.. కొన్నాళ్లుగా హరీందర్ ఆమెపై బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నాడు. బెదిరింపులతోనే ఆమెను లొంగదీసుకుని నెల రోజుల్లో మూడుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇక గంగోలా గ్రామంలో వెలుగుచూసిన మరో ఉదంతంలో.. 58 ఏళ్ల జగదీష్ అనే వ్యక్తి, ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చాక్లెట్లు ఆశ చూపించి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లిన అతడు.. చిన్నారిని లైంగికంగా వేధించాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జగదీష్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు పోలీసులు.
ఈ రెండు ఘటనలు ఇలా ఉంటే.. గుర్గామ్ లోని సెక్టార్ 92లో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది.32 ఏళ్ల ఓ వ్యక్తి ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉండగా.. గుర్గామ్ పరిధిలో చిన్నారులపై వరుస అత్యాచార ఘటనలు వెలుగుచూడడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications