మోసం చేశాడని వాట్సాప్ లో ఆడియో పంపి కుటుంబమంతా ఆత్మహత్య
వ్యాపారంలో మిత్రుడు మోసం చేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలను చంపి, భార్య, భర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.
చెన్నై :వ్యాపారంలో మిత్రుడు మోసం చేయడంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలను చంపి, భార్య, భర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు.తమ చావుకు వ్యాపారంలో తన మిత్రుడు తనను మోసం చేసిన విషయాన్ని ఆడియో రికార్డుచేసి వాట్సాప్ లో తన స్నేహితులకు పంపాడు ఆ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.
తమిళనాడు రాష్ట్రంలోని విళుపురం కమలానగర్ లోని కైవల్లి వీధికి చెంిన బాబు అనే ధాన్యం వ్యాపారి చేస్తున్నాడు.రెగ్యులేటరీ మార్కెట్ యార్డులో రైతుల నుండి వరి , ఇతర ధాన్యాలను కొనుగోలుచేసి వ్యాపారులకు విక్రయించే కమీషన్ ఏజంటుగా వ్యవహరిస్తున్నాడు.

బాబుకు భార్య కవిత, కీర్తి, కీర్తీక అనే ఇద్దరు కవలలు ఉన్నారు. మూడు రోజుల క్రితం ఆయన కుటుంబసభ్యులతో కలిసి చెన్నైలోని కవిత బంధువుల ఇంటికి వెళ్ళాడుసోమవారం రాత్రి విళుపురం తిరిగి రాగానే రైల్వేస్టేషన్ నుండి ఇంటి వరకు కవిత తండ్రి మణివణ్ణన్ తీసుకెళ్ళాడు.
మంగళవారం ఉదయం తన మనమరాళ్ళను తీసుకెళ్ళేందుకు మణివణ్ణన్ ఇంటికి రాగానే ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలకు వెళ్ళి చూడగా, భార్య, భర్తలు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఇద్దరు పిల్లలు కూడ చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తించాడు.
కన్నబిడ్డను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకొన్న ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది. ఏడాది క్రితం ధాన్యం వ్యాపారాన్ని పంపించాడు అయితే పెరుమాల్ అనే మిత్రుడితో కలిసి ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించానని ఇందులో 15 లక్షల అప్పుతీసుకొని అతనికి ఇవ్వగా సంబంధించిన లావాదేవీలను చూపకుండా మోసానికి పాల్పడ్డాడని బాబు ఆరోపించాడు.
తన బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకొని , ఫోర్జరీ సంతకంతో తన ఖాతా నుండి డబ్బును డ్రా చేశాడని ఆయన చెప్పాడు. సుమారు 20 లక్షల వరకు నష్టపోయానని ఆయన ఆవేదన చెందాడు. చనిపోయేముందు వాట్సాప్ లో ఆడియో సందేశాన్ని రికార్డు చేసి వాట్సాప్ లో మిత్రులకు పంపాడు.ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు పిల్లలను చంపి, భార్య, తాను ఆత్మహత్యచేసుకొంటున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ ఆడియో సందేశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. తనను మోసం చేసిన పెరుమాల్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాబు పోలీసులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కో;ణాల్లో విచారణ జరుపుతున్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications