సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల గ్రనేడ్ల దాడి, గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం రోజూ గ్రనేడ్లతో సీఆర్పీఎఫ్ జవాన్లపై విరుచుకుపడ్డారు. త్రాల్‌లో సీఆర్పీఎఫ్‌ శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది జవాన్లు గాయపడ్డారు.

వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ముష్కరులు నాలుగు గ్రనేడ్లు విసిరారు. గత వారం రోజులుగా సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉంటూ 17 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Four grenade attacks, army camp fired upon by militants in Kashmir

ఈ నేపథ్యంలో భారత సైన్యంపై ముష్కరులు ప్రతికార దాడులు చేస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు. నిన్న రాత్రి పుల్వామా జిల్లాలో త్రాల్‌ వద్ద సీఆర్పీఎఫ్‌ 180వ బెటాలియన్‌ క్యాంప్‌పై దాడికి పాల్పడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fourth grenade attack took place in Jammu and Kashmir on Tuesday with the latest one being at a CRPF camp in Pahalgam.
Please Wait while comments are loading...