చీకటి రోజు, చిన్న పిల్లల్లా: ఆ నలుగురు జడ్జీలపై విమర్శలు, ‘మోడీ చొరవ చూపాలి’

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలిపై ఆరోపణలు చేసిన నలుగురు సుప్రీం న్యాయమూర్తులపై పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జస్టిస్ ఆర్ఎస్ సోధీ మాట్లాడుతూ.. ఆ నలుగురు న్యాయమూర్తులు అపరిపక్వత కనబరిచారని విమర్శించారు.

సుప్రీంలో అవాంఛనీయ సంఘటనలు, చీఫ్ జస్టిస్ వినలేదు: చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్

  చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్..!

  చిన్న పిల్లల మాదిరిగా వ్యవహరించారని చురకలంటించారు. వారిని వెంటనే అంభిశంసించాలన్నారు. ఇటువంటి ట్రేడ్ యూనియనిజం చాలా తప్పు అని అన్నారు.

   మీరెలా చెబుతారు?

  మీరెలా చెబుతారు?

  ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పవలసినది వాళ్లు కాదని సోధీ స్పష్టం చేశారు. మనకు పార్లమెంటు, కోర్టులు, పోలీసు వ్యవస్థ క్రియాశీలకంగా ఉన్నాయని చెప్పారు. జస్టిస్ పీబీ సావంత్ మాట్లాడుతూ.. జడ్జీలు మునుపెన్నడూ లేనివిధంగా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు. దీనిని బట్టి సీజేఐతో గానీ, అంతర్గతంగా గానీ తీవ్ర వివాదం ఉన్నట్లు అర్థమవుతోందని అన్నారు.

  ఆందోళనకరం

  ఆందోళనకరం

  కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ఈ పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేసినట్లు తెలిపారు. జడ్జీలు మీడియాతో మాట్లాడవలసిన ఒత్తిడి సుప్రీంకోర్టు జడ్జీలకు రావడం ఆందోళనకరమని అన్నారు.మరో న్యాయవాది కేటీఎస్ తుల్సీ మాట్లాడుతూ.. ‘ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు ఇలా ఫిర్యాదులు చేస్తున్నారంటే.. దాని వెనుక బలమైన కారణాలు ఉండి ఉంటాయి. వాళ్లు మాట్లాడేటపుడు వాళ్ల ముఖాల్లో ఎంతో బాధ కనిపిస్తుంది' అని వ్యాఖ్యానించారు.

  ఇదొక చీకటి రోజే...

  ఇదొక చీకటి రోజే...

  సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు ఇదొక చీకటి రోజని అన్నారు. నేటి ప్రెస్ కాన్ఫరెన్స్ చెడు దృష్టాంతంగా నిలుస్తుందన్నారు. నేటి నుంచి ప్రతి సామాన్యుడూ ప్రతి తీర్పునూ అనుమానంతో చూస్తాడని, ప్రతి తీర్పును ప్రశ్నించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

  నీర్జా హంతక ఉగ్రవాదులు వీరే: ఏజ్‌తో ఫొటోలు రిలీజ్ చేసిన ఎఫ్‌బీఐ

   సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు

  సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు

  కాగా, బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ నలుగురు న్యాయమూర్తులకు మద్దతుగా మాట్లాడారు. ఆ నలుగురు న్యాయమూర్తులను విమర్శించలేమని అన్నారు. వారు గొప్ప నిజాయితీ, చిత్తశుద్ధిగలవారన్నారు. వారి లీగల్ కెరీర్‌లో చాలా భాగాన్ని త్యాగం చేశారని చెప్పారు. ఆ సమయంలో వారు కావాలంటే న్యాయవాదులుగా చాలా సొమ్ము సంపాదించే వారని అన్నారు. మనం వారిని గౌరవించాలని అన్నారు.

   మోడీ చొరవ తీసుకోవాలి..

  మోడీ చొరవ తీసుకోవాలి..

  ఆ నలుగురు జడ్జీలు, సీజేఐ, వాస్తవానికి మొత్తం సుప్రీంకోర్టు ఏకాభిప్రాయానికి వచ్చి, తదుపరి కార్యకలాపాలు సజావుగా నడిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ చూపాలని సుబ్రహ్మణ్య స్వామి కోరారు.

  భారత నిఘా నేత్రం కార్టోశాట్-2: పాక్‌కు ఇక వణుకే

   ఆ నలుగురికి మరో ఇద్దరి మద్దతు

  ఆ నలుగురికి మరో ఇద్దరి మద్దతు

  మరో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా తీవ్ర పరిణామమని, దీని వల్ల సీజేఐపై పెద్ద నీడ పడిందని అన్నారు. సీజేఐ తన అధికారాలను దారుణంగా దుర్వినియోగం చేస్తున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితులు తప్పవని, అందుకే మునుపెన్నడూ లేని విధంగా ఈ పరిణామం చోటు చేసుకుందని అన్నారు. కాగా, సీజేఐపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నలుగురు జడ్జీలకు మరో ఇద్దరు సుప్రీం జడ్జీలు మద్దతుగా రావడం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Former judge RS Sodhi on Friday came down heavily on four judges of the Supreme Court who voiced their dissent against the Chief Justice of India (CJI) and called their behaviour "immature and childish".

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి