ఫేస్‌బుక్‌లో లైక్ ల కోసం చూసుకుంటే.. నలుగురి ప్రాణాలే పోయాయి!
సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలు పొగొట్టుకునే వారి గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ‘లైక్స్’ కోసం చూసుకుంటే నలుగురి ప్రాణాలే పోయాయి.
ఉదయ్‌పూర్: సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలు పొగొట్టుకునే వారి గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో 'లైక్స్' కోసం చూసుకుంటే నలుగురి ప్రాణాలే పోయాయి.
కారులో స్పీడ్ రైడ్ చేస్తూ.. తమ రైడ్ ను ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారా యువకులు. లైక్ ల సంగతేమోగానీ, 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురై నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు.

రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... 20-25 ఏళ్ల వయసున్న ఎనిమిది మంది యువకులు దీపావళి రోజున రాత్రి కారులో స్పీడ్ రైడ్ కోసం బయలుదేరారు.
దుంగార్పూర్ నుంచి బయలుదేరిన వీరి కారు ఉదయ్‌పూర్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ ఇచ్చుకుంటూ.. కారును అమితమైన వేగంతో నడుపుతూ.. 120 కిలోమీటర్ల వేగానికి చేరే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కారులో ముందు కూర్చున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని పోలీసులు ఉదయ్‌పూర్ లోని ఎంబీ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications