వివేకానంద స్వామిపై క్విజ్: ముస్లీం అమ్మాయిలు టాప్ ఫోర్
గాంధీనగర్: స్వామి వివేకానందపై నిర్వహించిన క్విజ్ పోటీలో నలుగురు ముస్లిం బాలికలు టాపర్స్‌గా నిలిచారు. రామకృష్ణ మఠం నిర్వహించిన ఈ క్విజ్ పోటీలో గుజరాత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 74,529 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
చివరికి రెహానా రహీం, యశ్రాబాను మాస్టర్, జీల్బాను ముల్తాని, మరియంఖాటు అస్లాం ఖాన్ అనే ముస్లిం బాలికలు టాప్‌లో నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ సోమవారం వడోదరలో టాప్‌లో నిలిచిన వీరికి బహుమతులు అందజేశారు.

ప్రతి విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడే స్ఫూర్తిదాయ పుస్తకాలు చదవాలని ఈ సందర్భంగా ఆనందీ బెన్ పటేల్ పిలుపు ఇచ్చారు. పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులతో అలాంటి పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మన క్యారెక్టర్ నిర్మాణం ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. స్ఫూర్తినిచ్చే పుస్తకాలు ఎప్పుడు చదవాలన్నారు.
కాగా, గెలుపొందిన రెహానా రహీమ్ జునాగఢ్ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని. యశ్రాబాను మాస్టర్ అహ్మదాబాదులోని హెచ్‌బీకే న్యూ స్కూల్ విద్యార్థని. జీల్బాను ముల్తానీ అమ్రేలీలోని జేఎన్ మెహ్రా హైస్కూల్ విద్యార్థిని. మరియంఖాటు అస్లాం ఖాన్ వల్సాద్‌లోని గంగా స్కూల్ విద్యార్థిని.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications