అమ్మ వీరాభిమానులు.. అపోలో వద్ద అవన్నీ ఉచితంగా..
చెన్నై : గతకొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తమిళనాడు సీఎం జయలలితపై ఆమె అభిమానులు బెంగ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఆసుపత్రిలోకి ఎవరినీ అనుమతించడం లేదని తెలిసినా.. పలువురు అభిమానులు అమ్మను చూడాలనే ఆశతో అపోలో ఆసుపత్రికి వస్తున్నారు.
దీంతో ఆసుపత్రికి వచ్చే అభిమానులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించుకున్నారు కొంతమంది అభిమానులు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వద్ద అమ్మ కోసం వచ్చే అభిమానులకు ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఇక సుగుమార్ అనే మరో వీరాభిమాని తన ఆటో ద్వారా ఉచిత సర్వీస్ ను అందిస్తున్నాడు.

అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి అపోలో ప్రాంగణంలోనే తచ్చాడుతున్న సుగునూర్.. అమ్మ కోసం వచ్చే అభిమానులకు ఉచిత ఆటో సర్వీస్ అందిస్తున్నాడు. అంతేకాదు కొబ్బరి బోండాలు సైతం తీసుకొచ్చి అమ్మ అభిమానులకు ఉచిత కొబ్బరి నీళ్లు పంపిణీ చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఈ సేవా కార్యక్రమాల కోసం మొత్తం రూ. 19,000 ఖర్చు చేసినట్లు మీడియాతో వెల్లడించాడు.












Click it and Unblock the Notifications