బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిలకు ఎల్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య: బీజేపీకి ఝలక్ ఇచ్చిన సీఎం సిద్దూ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: 2018-19 విద్యాసంవత్సరం నుంచి కర్ణాటకలోని అమ్మాయిలకు ఎల్ కేజీ నుంచి పీజీ పూర్తి అయ్యే వరకు ఉచిత విద్య అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య హామీ ఇచ్చారు. అమ్మాయిలకు ఉన్నత చదువులు చదివించడానికి అధిక ప్రధాన్యత ఇస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారు.

 అబ్బాయిలకు తీసిపోరు

అబ్బాయిలకు తీసిపోరు

అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఏ విషయంలోను తీసిపోరని, వారు అన్ని రంగాల్లోరాణిస్తున్నారని, విద్యలో ముందు ఉంటున్నారని సిద్దరామయ్య చెప్పారు. అందుకే అమ్మాయిల చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకారాదని ఉచిత విద్య అందించాలని నిర్ణయించామని సీఎం సిద్దరామయ్య అన్నారు.

అమ్మాయిలకు ఉజ్వలభవిష్యత్తు

అమ్మాయిలకు ఉజ్వలభవిష్యత్తు

బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్ ఆవరణంలో బెంగళూరు కేంద్ర విశ్వవిధ్యాలయంలో శతమానోత్సవాల స్మారకభవనంకు శంకుస్థాపక చేసిన సీఎం సిద్దరామయ్య అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్టాడారు. కర్ణాటకలోని ప్రతి అమ్మాయికి ఇక ముందు ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని సీం సిద్దరామయ్య జోస్యం చెప్పారు.

ఎందరో మహానుభావులు

ఎందరో మహానుభావులు

బెంగళూరు విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఎందరో మహానుభావులు ఈ రోజు ఉన్నత పదువుల్లో ఉన్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన వారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని సీఎం సిద్దరామయ్య చెప్పారు.

రూ. 100 కోట్లు

రూ. 100 కోట్లు

బెంగళూరు విశ్వవిద్యాలయంలో నూతన కట్టడాలు నిర్మించడానికి, భవనాలకు మరమత్తులు చెయ్యడానికి ఇక్కడే రూ. 25 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నామని సీఎం సిద్దరామయ్య అన్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయం శతమానోత్సవాలకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని సిద్దరామయ్య హామీ ఇచ్చారు. 43 ఎకరాల్లో ఉన్న విశ్వవిద్యాలయానికి ఇంకా 50 ఎకరాల భూమి కేటాయించాని విశ్వవిద్యాలయం పదాధికారులు సీఎం సిద్దరామయ్యకు ఇదే సందర్బంలో మనవి చేశారు.

English summary
Chief minister Siddaramaiah said the state government is providing free education for girls students from this year. He was addressing gathering after laying stone for centenary memorial hall at uvce on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X