వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెట్రో‌తో పాటు బస్సుల్లో.. మహిళలకు ఉచిత ప్రయాణం...ఎన్నికల తాయిళాలు ప్రకటించిన ఆప్..

|
Google Oneindia TeluguNews

ఎన్నికల వేళ డిల్లీలో ఆప్ పుంజుకునేందుకు ఎన్నికల తాయిళాలను ఇప్పటినుండే ప్రకటిస్తోంది.ఇటివల పార్లమెంట్ ఎన్నికల్లో డిల్లిలోని ఏడు సీట్లలో ఒక్క సీటు కూడ గెలుచుకోకపోవడంతో ఆప్ డీలా పడింది. మరోవైపు కొద్దిరోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే అలర్ట్ అయింది. ఈనేపథ్యంలోనే డిల్లీ మెట్రోతోపాటు ,బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించేందుకు ఆప్ ప్రభుత్వం సిద్దమైంది.

డిల్లీ మహిళ ప్రయాణికులకు ఆప్ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. మహిళలకు పూర్తిగా ఉచితంగా మెట్రో రైలుతోపాటు , బస్సుల్లో కూడ ప్రయాణించేందుకు సాధ్యాసాధ్యాలను పై డిల్లీ రవాణ శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ డిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనిపై సోమవారం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

free for women travels in Delhi metro & bus

మరోవైపు ఢిల్లి మెట్రోలో కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలకు 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే మెట్రోపై పూర్తి అధికారం గనుక రాష్ఠ్ట్ర్ర ప్రభుత్వానికి సక్రమిస్తే మాత్రం చార్జీల్లో 30 శాతం మేర తగ్గిస్తామని అప్ ఢిల్లి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. దీంతో ఇచ్చిన హమీతోపాటు మరో ఆరు నెలల్లో ఢిల్లీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం ఇప్పటి నుండే పావులు కదుపుతోంది.దీంతోపాటు ఫిక్స్‌డ్

విద్యుత్ చార్జీలను కూడ త్వరలో ప్రకటించేందుకు ఆప్ ప్రభుత్వం సిద్దమవుతుంది.

English summary
With Assembly polls due early next year in the city, the Aam Aadmi Party government is considering to make metro and bus travels free for women in Delhi "to encourage them to use public transport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X