వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోకరితో ప్రేమలో పడిందని, తనతో అబద్దాలు చెబుతోందని , అతను ఏం చేశాడో తెలుసా

తనతో కాకుండా వేరే వ్యక్తితో ప్రేమలో ఉందనే అక్కసుతో సిమ్రాన్ అనే యువతిని శుభం గుప్తా హత్య చేశాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :వేరే వ్యక్తితో ప్రేమలో పడిందనే అక్కసుతో ఇంటి ఎదుటే ఓ యువతిని కాల్చిచంపాడు యువకుడు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. తనతో కాకుండా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడమే కాకుండా తనకు అబద్దాలు చెప్పడం సహించలేక యువతిని కాల్చిచంపానని నిందితుడు చెప్పాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో రెండు రోజుల క్రితం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

న్యూఢిల్లీలోకి నజఫ్ గఢ్ కు చెందిన సిమ్రాన్ అనే యువతిని శుభం గుప్తా అనే యువకుడు రెండు రోజుల క్రితం ఇంటి ఎదుటే తుపాకితో కాల్చిచంపాడు. ఆసు,పత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. అయితే సిమ్రాన్ వ్యవహరశైలి నచ్చకే ఆమెను చంపినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు.

సిమ్రాన్ పై కాల్పులు జరిపి ఢిల్లీలోని తన బంధువుల ఇంట్లో ఉన్న శుభం గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.హత్య జరగడానికి ముందు సిమ్రాన్, శుభం గుప్తా లు తీసుకొన్న ఫోటోల ఆధారంగా పోలీసులు ఈ కేసు చేధించారు.

friend accused of shooting dead najafgarh teen arrested

సిమ్రాన్ మొబైల్ లో ఈ ఫోటోలను స్వాధీనం చేసుకొన్నారు. దక్షిణ డిల్లీలోని తన బంధువుల ఇంట్లో దాక్కొన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నితిన్ అనే మరో వ్యక్తితో సిమ్రాన్ సన్నిహితంగా ఉంటుందని ఆయన గమనించాడు.

అంతేకాదు తనకు అబద్దాలు చెప్పేదని శుభం గుప్తా పోలీసులకు వివరించాడు. తన తల్లి ఫోన్ చేసినప్పుడు నితిన్ లాగా మాట్లాడాలని చెప్పడంతో ఆమె పట్ల తనకు విపరీతమైన కోపం వచ్చిందని ఆయన చెప్పాడు. ఇదే విషయమై ఇంటి వద్ద గొడవ జరిగిందని కోపంతో ఆమెపై కాల్పులు జరిపినట్టు ఆయన చెప్పాడు.

English summary
shubam gupta was arrested on friday on the charge of shooting dead friend simran.he was angry when she failed to explain why she was receiving repeated calls from her friend nitin.it could be a case of unrequited love and the young man felt betrayed and jealous said police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X