స్నేహితుల దారుణ హత్య, గంజాయి వ్యాపారం, 20 కేసులు, బెయిల్ మీద వస్తే!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ఆరల్‌వాయ్‌మొలి సమీపంలోని సీతప్పాల్‌ కొండ ప్రాంతంలో . ఇద్దరు స్నేహితులు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారిలో ఒకరు గంజాయి వ్యాపారి ఉన్నారు.

 20 కేసులు

20 కేసులు

సీతప్పాల్ లో భువనేష్ మణి (35), సూర్య మణి దంపతులు నివాసం ఉంటున్నారు. భువనేష్ మణి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. ఇతని మీద కొట్టూరు, భూతప్పాడి, అరల్ వాయ్ మొళి పోలీస్ స్టేషన్లలో దాదాపు 20 కేసులు నమోదు అయ్యాయి.

 బెయిల్ మీద వచ్చాడు

బెయిల్ మీద వచ్చాడు

ఇటీవల అరెస్టు అయిన భువనేష్ మణి జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారని సమాచారం వస్తే సీతప్పాల్ లోని కొండ మీద తలదాచుకునేవాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన ఇతను రెండు రోజుల క్రితం రాత్రి వడచేరి అరుగువిలైకి చెందిన షాజీ అనే స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.

స్నేహితుడు

స్నేహితుడు

అనంతరం భువనేష్ మణి, షాజీ కలిసి బయటకు వెళ్లారు. తరువాత ఇద్దరూ ఇంటికి తిరిగిరాలేదు. భువనేష్‌మణి కోసం భార్య పలు చోట్లలో గాలించినా అతని ఆచూకీ లభించలేదు. సీతప్పాల్‌ కొండపై ప్రాంతంలో ఉంటాడనే అనుమానంతో భునేష్‌మణి తండ్రి సెల్వమణి అక్కడికి వెళ్లి చూశారు.

 దారుణంగా చంపేశారు

దారుణంగా చంపేశారు

సీతప్పాల్ కొండ మీద భువనేష్‌మణి గొంతు కోసి హత్య చేశారని, షాజీని కత్తితో పొడిచి హత్య చేశారని గుర్తించి ఆందోళన చెందిన సెల్వమణి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసారి పల్లమ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి హంతకుల కోసం గాలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Friends brutal murder near Aralvaimozhi in Kanniyakumari District in Tamil Nadu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి