వీధి గొడవలు చేసిన కొడుకు: తండ్రిని కాటికి పంపించాడు
బెంగళూరు: కొడుకు చేసిన తప్పునకు తండ్రి బలి అయిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపురలోని హనుమంత నగరలో నివాసం ఉంటున్న గుణశేఖర్ (52) అనే వ్యక్తి హత్యకు గురైనాడు.
గుణశేఖర్‌కు కార్తిక్ అనే కుమారుడు ఉన్నాడు. కార్తిక్, సత్య స్నేహితులు. ఇటీవల క్రితం సత్య, కార్తిక్ మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కార్తిక్ అతని స్నేహితులు సత్య మీద దాడి చేశారు. సాటి స్నేహితులు ఇరు వర్గాలను విడదీశారు. అప్పటి నుండి వీరు రెండు వర్గాలుగా చీలిపోయారు. అప్పటి నుండి సత్య అతని అనుచరులు కార్తిక్ మీద కక్ష పెంచుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురు పడినప్పుడు పరస్పరం దాడులు చేసుకున్నారు.
గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో సత్య అతని స్నేహితులు హరీష్, విజయ్ కుమార్‌లను వెంట పెట్టకుని కార్తిక్ ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఆ సందర్బంలో గుణశేఖర్ బయటకు వచ్చి తన కుమారుడు కార్తిక్ బయటకు వెళ్లాడని, అతను వచ్చిన తరువాత మీరు వచ్చిన విషయం చెబుతానని అన్నాడు.

ఆ సమయంలో సహనం కోల్పోయిన సత్య నీ కొడుకు లేకుంటే నీవు ఉన్నావు కదా అని గొడవ పెట్టుకున్నారు. తరువాత కత్తి తీసుకుని గుణశేఖర్‌ను ఇష్టం వచ్చినట్లు పొడిచారు. వెంటనే కుటుంబ సభ్యులు గుణశేఖర్ ను నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. తరవాత విక్టోరియా ఆసుత్రికి తరలించారు. చికిత్స విఫలమైన శుక్రవారం గుణశేఖర్ మరణించాడని పోలీసులు తెలిపారు. ముగ్గరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
సెక్యూరిటి గార్డు హత్య...........!
సంజయ్ నగరలోని ఆర్ ఎంసీ రెండవ స్టేజ్ లో గెస్ట్ హౌస్ ఉంది. ఈ గెస్ట్ హౌస్ కు మరమత్తులు చేస్తున్నారు. ఇక్కడే మహాలింగ (35) అనే అతను సెక్యూరిటిగార్డుగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో మహాలింగ అక్కడ ఉన్న విషయం స్థానికులు గుర్తించారు. అర్దరాత్రి తరువాత గుర్తు తెలియని వ్యక్తులు మహాలింగ తల పగలగొట్టి దారుణంగా హత్య చేశారు.












Click it and Unblock the Notifications