• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాపులర్ స్కీమ్స్: అమ్మ క్యాంటీన్ల నుంచి ఫ్రీ ల్యాప్ టాప్స్ దాకా..

By Pratap
|

చెన్నై: దేశంలోని ప్రజాదరణ గల నాయకుల్లో ఒకరైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాత్రి కన్ను మూశారు. అపోలో ఆస్పత్రిలో ఆమె సోమవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు .

ఆమె మృతికి తమిళనాడు శోకసముద్రమైంది. తాము ప్రేమగా పిలుచుకునే అమ్మ ఇక లేరనే వాస్తవాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాకర్షక పథకాలకు జయలలిత మారుపేరుగా మారారు. అమ్మ పేరు మీద ఆమె పలు ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టారు.

మొదటి మహిళా పోలీసు స్టేషన్లు...

దేశంలో మొట్టమొదటిసారిగా 1992లో మహిళా పోలీసు స్టేషన్లను పెట్టిన కీర్తి జయలలితకే దక్కుతుంది. ప్రస్తుతం తమిళనాట 200 మహిళా పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అటువంటి పోలీసు స్టేషన్లు తమిళనాడులో ప్రస్తుతం 40 శాతం ఉన్నాయి.

From Amma canteens to free laptops Jayalalithaa's popular schemes

క్రెడిల్ బేబీ స్కీమ్

లింగ నిష్పత్తిని పెంచడానికి, ఆడశిశువుల మరణాలను తగ్గించడానికి జయలలిత 1992ోబ సేలంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 2011 నాటికి ఆడపిల్లల నిష్పత్తి పెరిగిన సూచనలు కనిపించాయి.

నూతన వీరానం స్కీమ్

చెన్నై ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. మంచినీటి సమస్యను తీర్చ్ ఈ పథకాన్ని 2004లో ప్రారంభించారు. ఈ పథకాన్ని అన్నాదురై, ఆ తర్వాత కరుణానిధి చేపట్టినపప్టకీ దానికి కొత్త జీవం పోసింది జయలలితనే. దీనికి 2001లో కొత్త వీరానం స్కీమ్ అని నామరకణం చేశారు.

ఇంకుడు గుంతల ఉద్యమం

వర్షం నీటిని నిల్వచేసే పథకాన్ని 2001లో ప్రారంభించారు. ప్రతి భవనంలో ఇంకుడు గుంతలు ఉండాలనే ఈ పథాకాన్ని చేపట్టం వల్ల చెన్నైలో భూగర్భ జలాలు పెరిగాయి.

ఉచిత ల్యాప్ టాప్‌లు...

ఈ పథకాన్ని జయలలిత ప్రభుత్వ, ప్రబుత్వ అనుబంధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల కోసం 2001లో అమలులోకి తెచ్చారు ఈ పథకం వల్ల 3.25 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

అమ్మ క్యాంటీన్లు...

ఈ పథకాన్ని 2013లో ప్రారంభించారు. తక్కువ ధరకు వీటిలో ఆహార పదార్థాలను అందిస్తారు. ఇడ్లీ రూపాయికి, పొంగల్ ఐదు రూపాయలకు, కర్డ్ రైస్ రూ. 3లకు లభిస్తాయి.

అమ్మ బేబీ కేర్ కిట్స్

గర్భవతుల్లో, అప్పుడే పుట్టిన శిశువుల్లో ఆరోగ్యాన్ని పెంచడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్‌లో 16 వస్తువులు ఉంటాయి. టవల్, డ్రెస్, బెడ్, పొటెక్టివ్ నెట్, నాప్‌కిన్ ఆయిల్, బేబీ సోపం, షాంపూ, సోప్ బాక్స్, లిక్విడ్ హ్యాండ్ వాష్, నెయిల్ కట్టర్, బేబీ రాటిల్, టాయ్, తదితర వస్తువులు ఉంటాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One of the most popular leaders in the country, J Jayalalithaa passed away at 11.30 PM at the Apollo Hospital on Monday. There has been an outpouring of grief in Tamil Nadu since the news broke out. Amma as she was fondly called was a popular leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more