జాతీయ రహదారులపై టోల్ బాదుడు: ఏఫ్రిల్ 1 నుండి 7 శాతం పెరిగిన ఛార్జీలు
న్యూఢిల్లీ: టోల్ రేట్లు ఏప్రిల్ 1వ తేది నుండి పెరిగాయి. జాతీయ రహదారుల హైవే అథారిటీ టోల్ రేట్లను సవరించింది. ఈ మేరకు గతంలో ఉన్న రేట్లకు బదులుగా 7 శాతం టోల్ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకొంది. దీంతో టోల్ బాదుడు మరింత పెరిగే అవకాశం ఉంది.
టోల్ ధరలు సరుకులపై తీవ్రంగా పడే అవకాశం కన్పించనుంది నిత్యావసర సరుకుల ధరలు కూడ పెరిగే అవకాశం ఉంది. ప్రతి నెలలో సుమారు 50 ట్రిప్పులు ధరలను కూడ నేషనల్ హైవే అథారిటీ పెంచింది. దీంతో నిత్యావసర సరుకులపై కూడ తీవ్రంగా కన్పించే అవకాశం ఉందని రవాణ శాఖాధికారులు చెబుతున్నారు. దేశంలో సుమారు 372 టోల్‌ప్లాజాలున్నారు. ఆయా ప్రాంతాలు, వాహనాల రాకపోకల ఆధారంగా రేట్లలో కొంచెం మార్పులు ఉన్నాయి.

ఏప్రిల్ 1 నుండి టోల్ రేట్లు పెంచడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నాయి. టోల్ ధరలను తగ్గించాలని కోరుతున్నాయి. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించాలని ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ తరుణంలో కొత్తగా ఛార్జీల పెంపుతో తీవ్రంగా నష్టపోతామని వారు చెబుతున్నారు. మరోవైపు బడ్జెట్లో పన్నులు, లెవీల్లో మార్పులకు అనుగుణంగా ఆయా వస్తువుల ధరలు కూడ పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications