సస్పెన్స్ : రేప్ చేసింది మహిళా..? బాలుడా..?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : ఆ ఇద్దరికీ ఫేస్ బుక్ ద్వారా పరిచయం. అందులో బాలుడి వయసు 17 ఏళ్లు కాగా, మహిళ వయసు 26 ఏళ్లు.. ఛాటింగ్ లతో దగ్గరైన ఆ ఇద్దరు ఓ మీటింగ్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగా ఓ హోటల్ గదిలో ఇద్దరు కలుసుకున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. గదిలోకి వెళ్లాక బాలుడు తనను రేప్ చేశాడని మహిళ..! లేదు తనే నాపై రేప్ కు యత్నించిందని బాలుడు..! పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే సదరు బాలుడు, మహిళ ఇరువురి వాదనలు వేరుగా ఉండడంతో, అసలు బాధితులెరు..? నిందితులెవరు..? అన్న దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొంది.

వివరాల్లోకి వెళ్లితే.. సౌత్ ఢిల్లీలోని కిషన్‌ఘడ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ఓ 17 ఏళ్ల బాలుడికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా ఓ 26 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య ఛాటింగ్ నిత్యకృత్యం అయిపోయింది. ఇదే క్రమంలో ఓ రోజు బాలుడిని కలవాలని కోరిన మహిళ, మహిపాల్ పూర్ లో ఉన్న త్రీ స్టార్ హోటల్ కు రావాల్సిందిగా చెప్పింది.

From Facebook to Delhi hotel: Woman, teenage boy accuse each other of rape

దీంతో మహిళ కోరిక మేరకు అక్కడికి వెళ్లిన బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు తెలుస్తోంది. బాలుడు చెప్పిన వివరాల ప్రకారం.. పూర్తిగా మధ్యం మత్తులో ఉన్న సదరు మహిళ సెక్స్ లో పాల్గొనాల్సిందిగా తనపై ఒత్తిడి తెచ్చిందని చెబుతున్నాడు బాలుడు. ఘటన అనంతరం బాలుడు విషయాన్ని పోలీసుల ధృష్టికి తీసుకెళ్లడంతో నిందితురాలిపై బాలల లైంగిక నేరాల చట్టం (పోస్కో) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది బాలుడి తరుపు కథనం.

మరోవైపు సదరు మహిళ వాదన బాలుడే నిందితుడు అన్నట్టుగా ఉంది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అతడే తనపై లైంగిక దాడికి యత్నించగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెబుతోంది. మహిళ ఫిర్యాదును సౌత్ ఢిల్లీ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ నుపుర్ కూడా ధృవీకరించారు. దీంతో రేప్ కు యత్నించింది బాలుడా..? లేక మహిళనా..? అన్న సందిగ్దం కొనసాగుతోంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిజానిజాలను బయటపెట్టే పనిలో ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a bizarre incident, a minor boy and a 26-year-old woman who met on Facebook, accused each other of sexual assault in a three-star hotel in Delhi's Mahipalpur area.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి