మేక్ ఇన్ ఇండియా కాదు, రేప్ ఇన్ ఇండియా, ప్రధానికి తెలుసా ? తెలీదా ? ఛీ... సిగ్గుగా ఉంది, కాంగ్రెస్!
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై ధౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. మహిళపై జరుగుతున్న లైంగిక దాడుల సంఖ్య ప్రతిరోజు పెరిగిపోతుంది. మహిళలకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా భద్రత కరువైయ్యింది. ఇదే విషయంలో మంగళవారం లోక్ సభలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. భారత్ దేశం గురించి మేక్ ఇన్ ఇండియా అనేకంటే రేప్ ఇన్ ఇండియా అనే ఎక్కువగా పేరు, ప్రచారం వస్తోందని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీకి దేశంలో జరుగుతున్న హత్యాచారాల గురించి తెలుసా ? తెలీదా ?, అన్నీ తెలిసినా ఆయన మౌనంగా ఉన్నారా ? అనే సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

వారం నుంచి ఇదే రామాయణం
లోక్ సభ సమావేశాల్లో గత వారం రోజుల నుంచి అనేక పార్టీల నాయకులు దేశంలో మహిళలకు భద్రత కరువైయ్యిందని, అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని విమర్శలు చేస్తున్నారు. డిసెంబర్ 10వ తేదీ మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మహిళల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి దుమ్మెత్తిపోశారు.

అనేక బిల్లులకు అమోదం
లోక్ సభ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక బిల్లులు ప్రవేశపెట్టి వాటి అమోదం పొందుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక బిల్లులు ప్రవేశపెట్టి అమోదముద్ర వేయించుకోవడంలో తీసుకుంటున్న శ్రద్ధ మహిళల భద్రత విషయంలో ఎందుకు పట్టించుకోవండం లేదు అనే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు.

ప్రధానికి తెలుసా ? తెలీదా చెప్పండి
దేశంలో మహిళల మీద అత్యాచారాలు చేసి దారుణంగా హత్యలు చేస్తున్న విషయం ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసా ? తెలీదా ? అనే విషయం బీజేపీ నాయకులు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయాలు అన్నీ తెలిసినా మోనంగా ఉన్నారా ? లేకపోతే ఆయనకు దేశంలో ఏం జరుగుతుందో తెలీదా ? అనే విషయం ఇప్పుడే చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు.

మేక్ ఇన్ ఇండియా కాదు రేప్ ఇన్ ఇండియా
ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలు తిరుగుతూ చాల ప్రసంగాలు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఎద్దేవ చేశారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో మేక్ ఇన్ ఇండియా అంటూ అనేక ప్రసంగాలు చేస్తున్నారని, ఆయన వ్యక్తిగత హోదా పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. అయితే నేడు భారత దేశం గురించి మేక్ ఇన్ ఇండియా కాదు రేప్ ఇన్ ఇండియా అంటూ అందరూ చర్చించుకుంటున్నారని, ఇది చాల సిగ్గుచేటు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తీవ్రస్థాయిలో ఆరోపించారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications