Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకులు: చంద్రబాబు ర్యాంక్ ఎంతో తెలుసా..?

ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. ప్రభుత్వాలను నడిపేది ప్రజలే. అందుకే ప్రభుత్వం నిలబడాలన్నా పడగొట్టాలన్నా అది కేవలం ప్రజలకే సాధ్యం.నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారంటే ప్రజలు ఆయనకు ఏమేరకు అండగా నిలిచారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకుల జాబితాను విడుదల చేసింది.

దేశంలో ఎంతో మంది రాజకీయనాయకులున్నారు. కొందరు కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ వారు పెద్దగా గుర్తింపు పొందలేదు. మరికొందరు తక్కువ సమయంలోనే ఇటు దేశవ్యాప్తంగా అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందారు. ఇక దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకుల జాబితాను ఇండియా టుడే విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకుల జాబితాలో తొలిస్థానంలో ప్రధాని మోదీ నిలిచారు. రెండవస్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలవగా మూడవ స్థానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చోటు దక్కించుకున్నారు.ఇక ఈ ఏఢాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చక్కటి ప్రదర్శన కనబర్చింది కాంగ్రెస్. లోక్‌సభ ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు.

From Modi to Bhagwat to Chandrababu naidu A Look at India s Most Powerful Political Figures

ఇక రాష్ట్ర ముఖ్యమంత్రుల విషయానికొస్తే నితీష్ కుమార్,చంద్రబాబు నాయుడు కింగ్‌మేకర్లుగా అవతరించారు. మోదీ ప్రభుత్వం ఈ ఇద్దరి అధినేతలపై ఆధారపడిఉంది. శక్తివంతమైన బీజేపీని ఎదురించి తమకు తిరుగులేదన్నట్లుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లున్నారు. ఇక యోగీ ఆదిత్యనాథ్ కూడా జాబితాలో స్థానం పొందగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, యోగీ తర్వాతి స్థానంలో నిలిచారు.

మోదీ నెంబర్ 1 స్థానంలో ఎందుకు..?

అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిస్థానంలో నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి మెజార్టీ స్థానాలు తగ్గినప్పటికీ అధికారం చేపట్టారు.ఈ మధ్యే జరిగిన హర్యానా ఎన్నికల్లో సైతం మోదీ మ్యాజిక్ కనిపించింది.ఇక మోదీ తొలి స్థానంలో నిలవడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి.మోదీ హయాంలో భారత్‌కు ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు దక్కింది. మోదీ తీసుకున్న లేదా అవలంబించిన విధానాలు ఆయన్ను తొలి స్థానంలో నిలిపాయి. అమెరికాతో సత్సంబంధాలు నెరుపుతూనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో శాంతి చర్చలు జరిపారు. గల్ష్ నేతలతో పాటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి.

మూడవ స్థానంలో అమిత్ షా..?

రాజకీయ నాయకుల్లో మోదీ తర్వాత శక్తివంతమైన నాయకుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా మూడవసారి కొనసాగుతున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో అమిత్ షా పాచిక పారనప్పటికీ హర్యానా ఎన్నికల్లో మాత్రం షా మార్క్ కచ్చితంగా కనిపించింది. దేశ అంతర్గత భద్రత విషయంలో హోంమంత్రిగా అమిత్ షా తీసుకున్న చొరవ భేష్ అని చెప్పొచ్చు.

From Modi to Bhagwat to Chandrababu naidu A Look at India s Most Powerful Political Figures

నాల్గవ స్థానంలో రాహుల్ గాంధీ..

లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాల్గవ స్థానంలో నిలిచారు. గత ఐదేళ్లలో రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు రాటుదేలాయి. మోదీకి ప్రత్యామ్నాయ శక్తిగా రాహుల్ ఎదిగే ప్రయత్నం చేశారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కిందంటే దాని వెనుక రాహుల్ కష్టం చాలా ఉంది.హర్యానాలో కాంగ్రెస్ నిరాశపర్చినప్పటికీ, రాహుల్ ఇంకాచాలా సమయం ఉంది. కాంగ్రెస్‌ను గాడిలో పెట్టే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిరుద్యోగం, రైతు కష్టాలు,కుల గణన లాంటి అంశాలను రాహుల్ ప్రస్తావిస్తూ అధికారపక్షాన్ని ఇరుకున పెడుతున్నారు.

From Modi to Bhagwat to Chandrababu naidu A Look at India s Most Powerful Political Figures

ఐదవ స్థానంలో చంద్రబాబు

అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకుల్లో చంద్రబాబు ఐదవ స్థానంలో నిలిచారు. ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. రాజకీయ చాణక్యత మెండుగా ఉన్న చంద్రబాబు ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాడు. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ... కేంద్రంలో 16 ఎంపీలతో కీలకంగా ఉంది.భారతదేశంలోని ముఖ్యమంత్రుల్లో సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నాల్గవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చూడాలన్న తన కలకు తిరిగి జీవం పోస్తున్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు అమరావతితో జీవం నింపే ప్రయత్నం చేస్తున్నారు.విజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు.. 2047 కల్లా ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు.కార్పొరేట్ ఫ్రెండ్లీ పొలిటీషియన్‌గా చంద్రబాబుకు మంచి గుర్తింపుంది.

ఇక దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయనాయకుల్లో ఆరవ స్థానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఏడవ స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్,8వ స్థానంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్,9వ స్థానంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,10 వ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+