వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుంభమేళా నుంచి రంజాన్ వరకూ- కరోనాపై హైకోర్టుల భిన్న తీర్పులు- గందరగోళం

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతోంది. అదే సమయంలో ప్రజలు పండుగల వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన ప్రభుత్వాలు రాజకీయ అవసరాల కోసం వారికి వంతపాడుతున్నాయి. దీనిపై దేశంలోని పలు హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిపై విచారణ జరుపుతున్న హైకోర్టుల తీర్పులు కూడా భిన్నంగా ఉండటం విశేషం. దీంతో పలు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్దితులు కనిపిస్తున్నాయి.

కరోనా వేళ పండుగల సందడి

కరోనా వేళ పండుగల సందడి

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజూ రెండున్నర లక్షల కొత్త కేసులు బయటపడుతున్నాయి. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి ప్రభావం ఉండటం లేదు. దీంతో పలు రాష్ట్రాలు మరో లాక్‌డౌన్‌ దిశగా పయనిస్తున్నాయి. అయితే అదే సమయంలో పండుగల సందడి కూడా పెరుగుతోంది. ప్రస్తుతం హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. మరోవైపు రంజాన్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రార్దనల కోసం ముస్లింలు కదులుతున్నారు. దీంతో ఈ జనసమూహాల ప్రభావం కరోనా వ్యాప్తికి కారణమవుతుందన్న ఆందోళన పెరుగుతోంది.

పండుగలపై హైకోర్టుల్లో పిటిషన్ల వెల్లువ

పండుగలపై హైకోర్టుల్లో పిటిషన్ల వెల్లువ


దేశవ్యాప్తంగా జరుగుతున్న రంజాన్‌ పండుగ సందర్బంగా మసీదుల్లో భారీ ఎత్తున జనం గుమికూడుతున్నారు. అలాగే హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు, నాగసాధువులు వస్తున్నారు. దీంతో ఆయా చోట్ల జన సమూహాల్ని అడ్డుకోవాలంటూ వివిధ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. కరోనా వేళ వీటిని నియంత్రించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టుల్నికోరుతున్నారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టులు వాటికి అడ్డుకట్టే వేసేలా, నియంత్రించేలా పలు తీర్పులు ఇస్తున్నాయి.

 రంజాన్‌ ప్రార్ధనలపై ఢిల్లీ, బోంబే హైకోర్టుల తలోదారి

రంజాన్‌ ప్రార్ధనలపై ఢిల్లీ, బోంబే హైకోర్టుల తలోదారి

రంజాన్‌ సందర్భంగా మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన బోంబే హైకోర్టు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే ప్రమాదం ఉన్నప్పుడు పండుగలకు, మత సంప్రదాయాలకు కూడా అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పింది. మరోవైపు కరోనా కల్లోలంతో లాక్‌డౌన్‌ విధించిన ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న బాంగ్లేవాలీ మసీదులో 50 మంది ప్రార్ధనలు జరుపుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రాలు మారినంత మాత్రాన ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి హైకోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వడమేంటన్న చర్చ సాగుతోంది.

కుంభమేళాపై ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆశ్చర్యకర తీర్పు

కుంభమేళాపై ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆశ్చర్యకర తీర్పు


అలాగే కుంభమేళాపై ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా పలువురిని ఆశ్చర్య పరిచింది. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ కుంభమేళా జరుపుకోవచ్చని నిర్వాహకులకు హైకోర్టు అనుమతిచ్చింది. అదే సమయంలో మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైతే మాత్రం కరోనా కల్లోలానికి దారులు తెరిచినట్లవుతుందని పేర్కొంది. అయితే ఇప్పటికీ కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఎలాంటి శానిటైజర్లు కానీ, మాస్కులు కానీ లేవు. భౌతిక దూరం పాటించడం లేదు. డాక్టర్లు, నర్సులకు ఎలాంటి కియోస్క్‌లు లేవు. పది లక్షల మందికి పైగా భక్తులు వచ్చిన కుంభమేళాలో పేరుకి 132 అంబులెన్స్‌లు పెట్టారు. దీంతో కుంభమేళాకు ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చిన అనుమతి విమర్శలకు తావిస్తోంది.

English summary
in covid 19 second wave time, different high courts in the country delivering constrasting orders on kumbh mela to ramzan festivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X