• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌లో కరోనా వ్యాక్సిన్ మొదట ఇచ్చేది వాళ్లకే... డేటా బేస్‌పై కేంద్రం కీలక ఉత్తర్వులు

|

రాబోయే ఆరు నెలల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఇటీవలి రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే... తొలుత ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న దానిపై కేంద్రం గత కొద్దిరోజులుగా కసరత్తులు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించి కేంద్రం ఓ ప్రణాళికను సిద్దం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ప‌నిచేసే ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ డేటా బేస్‌ను ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్‌వర్క్(E-VIN) ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ బెనిఫీషియరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా,నోడల్ అధికారులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మొదట వాళ్లకే...

జాబితాలో వీళ్లు కూడా...

జాబితాలో వీళ్లు కూడా...

ల్యాబోరేటరీలు,ఆపరేషన్ థియేటర్లలో పనిచేస్తున్న టెక్నీషియన్స్,పారామెడికల్ స్టాఫ్,ఫార్మాసిస్టులు,ఫిజియోథెరపిస్టులు,వార్డు బాయ్స్,రేడియోగ్రాఫర్స్,సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ స్టాఫ్,స్టూడెంట్స్-డెంటల్,మెడికల్,ఆయుష్,నర్సింగ్,పారామెడికల్ సిబ్బంది డేటా బేస్‌ను కూడా ప్రిపేర్ చేయనున్నారు. అలాగే సెంట్రల్ స్టెరైల్ డిపార్ట్‌మెంట్‌తో పాటు బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది,పారిశుద్ద్య కార్మికులు,అంబులెన్స్ డ్రైవర్లు,సెక్యూరిటీ సిబ్బంది,ఔట్ సోర్సింగ్ సిబ్బంది,క్లరికల్ సిబ్బంది,డేటా ఎంట్రీ సిబ్బందిలను జాబితాలో చేర్చనున్నారు.

జులై 2021 నాటికి...

జులై 2021 నాటికి...

మంగళవారం(అక్టోబర్ 20) జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. అయితే కరోనా ముప్పు అప్పుడే తొలగిపోలేదని... నిర్లక్ష్యంగా వ్యవహరించి తమతో పాటు తమ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా,దేశంలో జులై 2021 నాటికి 25 నుంచి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా 400 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తెస్తామని కేంద్రమంత్రి హర్షవర్దన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
The Union Health Ministry has issued an advisory for district and state-level nodal officers on how to prepare a database of healthcare workers, both in public and private settings, and upload the same on the COVID Vaccine Beneficiary Management System, being readied under the Electronic Vaccine Intelligence Network (E-VIN) platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X