20 రోజుల తర్వాత స్వల్పంగా అతి స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు, హైదరాబాద్‌లో ఎంతంటే?
న్యూఢిల్లీ: చాలా రోజుల తర్వాత పెట్రోల్ ధరలు సోమవారం నాడు స్వల్పంగా పెరిగాయి. గత ఇరవై రోజులుగా పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు అతి స్వల్పంగా పెరిగాయి. చివరిసారి డిసెంబర్ 17వ తేదీన పెట్రోల్ ధరలు పెరిగాయి.
హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్ ధర రూ.72.67 పైసలు, డీజిల్ ధర రూ.67.66 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోల్ ధర రూ.72.53 పైసలు, డీజిల్ ధర రూ.66.20 పైసలుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధరలు 21 నుంచి 23 పైసలు పెరగగా, డీజిల్ ధరలు 8 నుంచి 9 పైసలు పెరిగింది.
తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.68.50 పైసలు, డీజిల్ ధర రూ.62.24 పైసలు, ముంబైలో పెట్రోల్ ధర రూ.74.16 పైసలు, డీజిల్ ధర రూ.65.12 పైసలుగా ఉంది.












Click it and Unblock the Notifications