G20 summit: సెక్యూరిటీ కీలకంగా లాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్స్- అందులో అపార నైపుణ్యం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. దేశ రాజధానిలో 8, 9,10 తేదీల్లో ఈ సమ్మిట్ జరుగబోతోంది. దీనికోసం ఢిల్లీ ముస్తాబైంది. నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు.
జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.

కాగా- ఈ సదస్సు ఏర్పాటైన నేపథ్యంలో ఢిల్లీ భద్రత మొత్తం అత్యంత కట్టుదిట్టంగా మారింది. ప్రత్యేకించి ఈ సదస్సు జరిగే ప్రగతి మైదాన్ పరిసరాల్లో కనివినీ ఎరుగని సెక్యూరిటీ వ్యవస్థను మోహరింపజేశారు. అయిదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సదస్సు ముగిసేంత వరకూ 24 గంటల పాటు ఈ భద్రత వ్యవస్థ కొనసాగుతుంది.
జీ20 ప్రతినిధులు శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కావడానికి ముందు రాజ్‌ఘాట్‌ను సందర్శించాల్సి ఉంది. దీనితో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన కే9 స్నిఫర్ డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్ రాజ్‌ఘాట్ వద్ద విస్తృతంగా తనిఖీలను చేపట్టాయి. ఎన్ఎస్జీ స్పిఫర్ డాగ్స్ జెనాన్, మింగ్, జోన్, జోజో, జింగర్‌తో పాటు బాంబు డిస్పోజల్ యూనిట్స్ రాజ్‌ఘాట్ చుట్టుపక్కల తనిఖీలు చేపట్టారు.
లాబ్రడార్లు, జర్మన్ షెపర్డ్‌లు, బెల్జియన్ మాలినోయిస్, కాకర్ స్పానియల్‌లతో కూడిన యూనిట్.. స్నిఫర్ డాగ్ స్క్వాడ్స్‌లో భాగం అయ్యాయి. పేలుడు పదార్థాలను గుర్తించడంలో వాటికి ఎంతో అనుభవం, నైపుణ్యం ఉంది. రాజ్‌ఘాట్ వద్ద జామర్లనూ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వంటి ఇతర భద్రత సంస్థలు భద్రతలో భాగస్వామ్యం వహించాయి.












Click it and Unblock the Notifications